ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం!

మండే ఎండల్లో కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఉపశమనం కలిగింది. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

మండే ఎండల్లో కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఉపశమనం కలిగింది. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

భగ భగ మండే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అధిక ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోయారు. అధిక వేడి ఉక్కపోతలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలకు తాజాగా కురుస్తున్న వర్షాలతో భారీ ఉపశమనం లభిస్తుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే మరికొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు రానున్న వేళ ఈలోపే వర్షాలు కురవడంతో నీటి ఎద్దడి సమస్య నుంచి బయటపడే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఎండాకాలం ముగియక ముందే కురుస్తున్న వర్షాలతో వర్షాకాలం అప్పుడే వచ్చిందా అనే సందేహం కలగకమానదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం కూల్ అయిపోయింది. ఇంకొన్ని రోజులు వానలు కురువనున్న నేపథ్యంలో ఈ నెల 22నాటికి బంగాళాకాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మే 24నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, సముద్ర మట్టానికి 3.1కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వెల్లడించింది.

బంగాళఖాతంలో ఒక వేళ తుఫాన్ ఏర్పడితే ఏపీ, తెలంగాణాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక నేడు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలను కోరుతున్నారు.

Show comments