iDreamPost
android-app
ios-app

AP ప్రభుత్వం మరో ఘనత.. మంగళగిరి చేనేతకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం!

  • Author Soma Sekhar Published - 08:18 PM, Wed - 26 July 23
  • Author Soma Sekhar Published - 08:18 PM, Wed - 26 July 23
AP ప్రభుత్వం మరో ఘనత.. మంగళగిరి చేనేతకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. ఇప్పటికే విద్యారంగం, పశువైద్యరంగలో కృషికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు, అవార్డులు లభించాయి. తాజాగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఏపీ ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ లో చేనేత రంగానికి పెట్టింది పేరు మంగళగిరి పట్టణం. ఇక్కడ తయ్యారు అయిన చీరలకు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి మంగళగిరి చేనేతకు మరో అరుదైన గౌవరం దక్కింది. జాతీయ స్థాయిలో ఈ గౌరవం ఏపీకి దక్కింది.

ఏపీలో చేనేత రంగానికి పెట్టింది పేరు మంగళగిరి. ఈ ప్రాంతంలో తయ్యారు అయిన చీరలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీతో పాటుగా.. డిమాండ్ కూడా ఉంది. తాజాగా మంగళగిరి చేతనకు మరో అరుదైన గౌరవం దక్కింది. మంగళగిరి చేనేతకు భౌగోళిక గుర్తింపు దక్కింది. జాతీయ స్థాయిలో ఇలాంటి అరుదైన గౌరవం దక్కడంతో.. చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 7 చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా.. భారత ప్రధాని మోదీ చేనేత కార్మికులతో వర్చువల్ గా మాట్లాడనున్నారు. దీనికోసం దేశంలో 75 మంది నేతన్నలను, ఉత్పత్తిదారులను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా.. ఇప్పటికే కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా పర్యటించాయి. అందులో ఒక బృందం ఏపీలోని మంగళగిరిలో పర్యటించింది. ఈ క్రమంలనే చేనేత కార్మికుల కోసం నిర్మిస్తున్న మగ్గం షెడ్లు, చేనేత భవన సముదాయాన్ని పరిశీలించింది. వీటితో పాటుగా ఏపీ ప్రభుత్వం నేతన్నలకు అందిస్తున్న చేనేత నేస్తం పథకంపై కూడా బృందం ఆరా తీసింది. చేనేత కార్మికుల కొరకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించింది. దీంతో మంగళగిరి నేతన్నను ప్రధానితో మాట్లాడేందుకు బృందం ఎంపిక చేసింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారాన్ని ఇచ్చింది కేంద్ర బృందం. మరి మంగళగిరి చేనేతకు భౌగోళిక గుర్తింపు(GI) రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఇదేం ట్విస్టు మావా.. ఫోన్ దొంగిలించిన వ్యక్తితో రెండేళ్లుగా..!