అత్తారింటికి RTC బస్సు వేసుకెళ్లిపోయిన అల్లుడు! ఇలా ఎందుకు చేశాడంటే?

Muchumarri.. నంద్యాల జిల్లాలోని మచ్చుమర్రి గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. అత్తింటికి వెళ్లేందుకు ఓ అల్లుడు ఏకంగా ఆర్టీసీ బస్సును వేసుకుని వచ్చాడు. అందులో వింతేమీ ఉంది అనుకుంటున్నారా..? ఏమైందో ఈ స్టోరీ చదవండి

Muchumarri.. నంద్యాల జిల్లాలోని మచ్చుమర్రి గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. అత్తింటికి వెళ్లేందుకు ఓ అల్లుడు ఏకంగా ఆర్టీసీ బస్సును వేసుకుని వచ్చాడు. అందులో వింతేమీ ఉంది అనుకుంటున్నారా..? ఏమైందో ఈ స్టోరీ చదవండి

సామాన్యులు, మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా వినియోగించే వాహనం ఆర్టీసీ బస్సు. విద్యార్థులు, ఉద్యోగులు నిత్యం ఇందులో ప్రయాణీస్తుంటారు. ఇక మహిళలు ఏదైనా పనిమీద బయటకు వెళ్లాల్సి వస్తే ముందుగా దీన్నే ప్రిఫర్ చేస్తారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సులభతరం కావడంతో ఇందులో ఎక్కువ మంది ట్రావెల్ చేస్తుంటారు. ఇక సుదూర ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వెళ్లాలనుకునే వారికి ఫస్ట్ ఛాయిస్ ఇదే అవుతుంది. అయితే కొన్ని సార్లు పనిమీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బస్సుల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్ని సార్లు గంటల పాటు బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు జనాలు. విసుగెత్తి తర్వాత ఆటోనో లేదా ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి ఆప్షన్స్ వెతుకుతుంటారు. ఇది దగ్గర దూరానికి ఓకే కానీ.. దూర భారాలు వెళ్లాల్సిన వారి పరిస్థితి అనిర్వచనీయం, అగమ్యగోచరం. బస్సులు రాక.. ఇబ్బందులు పడుతుంటారు.

అయితే ఓ అల్లుడు ఏకంగా ఆర్టీసీ బస్సుతో అత్తారింటికి వెళ్లి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అల్లుడు బస్సు వేసుకురావడమేమిటీ..? ఎక్కడ నుండి వచ్చిందీ.? ఎలా తెచ్చాడు అనే ప్రశ్నలు అడిగితే అతడు చెప్పిన సమాధానం చూసి అవాక్కయ్యారట స్థానికులు. బస్సుల కోసం ఎదురు చూసి రాకపోవడంతో సమీపంలో నిలిపి ఉంచిన ఆర్టీసీ ప్రైవేట్ బస్సు వేసుకుని వచ్చేశాడట. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వెంకటపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఆత్మకూరు నుండి తన అత్తగారు ముచ్చుమర్రి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూశాడు. ఎంతకు ఆ బస్సు రాకపోవడంతో విసిగిపోయాడు. దీంతో సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర ఆర్టీసీ ప్రైవేట్ (హైర్) బస్సు వద్దకు వెళ్లి స్టార్ చేసి.. నడుపుకుంటూ తన అత్త ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అక్కడకు చేరుకున్నాక ఆశ్చర్యపోవడం వారి వంతైంది.

ఏంటీ సంగతని ప్రశ్నించగా.. ఇక్కడకు వచ్చేందుకు బస్సు కోసం వెయిట్ చేస్తే రాలేదని, ఇది కనిపించకగానే తీసుకు వచ్చినట్లు చెప్పాడు. అయితే కుటుంబ సభ్యుల సలహాతో పోలీస్ స్టేషన్‌లో బస్సు అప్పగించాడు. పోలీసులు కూడా దుర్గయ్య సమాధానం విని అవాక్కయ్యారు. వెంటనే బస్సును ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ నుండి ఆత్మకూరుకు పంపించారు. ఇదిలా ఉంటే.. ఈ బస్సు పోయిందని స్థానిక పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలుస్తుంది. ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదని సమాచారం. దుర్గయ్య చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటీ అనే ఆందోళన కూడా నెలకొంది స్థానికుల్లో. మొత్తానికి అల్లుడు ఘటికుడే అనుకుంటున్నారు అత్తింటివారు.

Show comments