iDreamPost
android-app
ios-app

నిత్యం వందల మంది కడుపు నింపుతున్నారు.. మీ సామాజిక సేవకు హ్యాట్సాఫ్ సార్

  • Published Jun 20, 2024 | 7:03 PM Updated Updated Jun 20, 2024 | 7:03 PM

Free Meals: ఒక రోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా రెండు నెలల నుంచి పేద ప్రజల కడుపు నింపుతున్నారా వ్యక్తి. ఆకలి అని ఎంతమంది వస్తే అంతమందికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా భోజనం వడ్డిస్తున్నారు. అది కూడా రుచికరమైన భోజనం.

Free Meals: ఒక రోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా రెండు నెలల నుంచి పేద ప్రజల కడుపు నింపుతున్నారా వ్యక్తి. ఆకలి అని ఎంతమంది వస్తే అంతమందికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా భోజనం వడ్డిస్తున్నారు. అది కూడా రుచికరమైన భోజనం.

నిత్యం వందల మంది కడుపు నింపుతున్నారు.. మీ సామాజిక సేవకు హ్యాట్సాఫ్ సార్

ఎంగిలి చేత్తో కాకిని తరిమితే ఎక్కడ మెతుకులు వృధా అవుతాయా అని ఆలోచించే మనుషులు ఉన్న ఈ సమాజంలో.. ఆకలితో కళ్ళ ముందు చస్తున్నా గానీ మన కడుపు నిండితే చాలు అని స్వార్థంతో బతికే మనుషులున్న ఈ సమాజంలో అన్నదానం చేసే గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని  మనుషులు అని కాకుండా దేవుళ్ళు అని పిలుస్తుంటారు. తాజాగా ఒక వ్యక్తి కూడా ఆ ఊరిలో పేద ప్రజల పాలిట దేవుడిగా ఎదిగిపోయారు. ఎవరైనా ఒకరోజు, రెండు రోజులు అన్నదానం చేస్తారు. కానీ ఈ వ్యక్తి రెండు నెలలుగా పేదల కడుపు నింపుతూనే ఉన్నారు. ఆకలి అని వచ్చిన వారికి తృప్తిగా తిరిగి వెళ్లేలా కడుపు నిండా భోజనం పెడుతున్నారు. అలా అని నాణ్యత లేని భోజనం పెట్టడం లేదు. రోజుకో వెరైటీ కూరలతో రుచికరమైన భోజనం వండి పెడుతున్నారు.

ఒక హోటల్ కి వెళ్తేనే భోజనానికి కనీసం 150 నుంచి 200 రూపాయలు అవుతుంది. అది కూడా వాళ్ళు పెట్టినంత తినాలి. ఎక్స్ ట్రా రైస్ కావాలంటే కొనుక్కోవాల్సిందే. కానీ ఈ వ్యక్తి మాత్రం ఎంత తింటే అంత కడుపు నిండా భోజనం పెడుతున్నారు. హోటల్ లో కూడా ఇంత రుచిగా పెట్టరేమో కానీ ఈయన ఫ్రీ మీల్స్ మాత్రం ఎంతో రుచిగా ఉంటున్నాయని స్థానికులు అంటున్నారు. రోజూ అనాథలు, కూలి పనులు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్లు, వృద్ధులు, పేద ప్రజలు, బిచ్చగాళ్ళు ఇలా వందల మంది అక్కడకి వెళ్లి ఉచితంగా తృప్తిగా భోజనం తిని వస్తారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో హైవే పక్కన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

తేజ ఉచిత భోజనం పేరుతో నిత్యం వందల మందికి భోజనం పెడుతున్నారు. ఏప్రిల్ నెలలో మొదలుపెట్టి ఈరోజు వరకూ ఉచితంగా భోజనం పెడుతూనే ఉన్నారు. అనాధలకు, కూలి పని చేసుకునేవారికి, పేద ప్రజలకు ఇలా ఆకలి అని వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నారు. అది కూడా ఒకటి, రెండు రోజులు కాదు. ప్రతి రోజూ ఇలానే చేస్తున్నారు. రావులపాలెంలో చిన్నం తేజ రెడ్డి అనే వ్యక్తి పేద ప్రజల కోసం ఉచిత భోజనం ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకూ ఈ ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ లో మొదలైన ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.

జూన్ 20 నాటికి మొత్తం 66 రోజుల పాటు అన్నదానం చేసినట్లు ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘ఇవాళ వేడి అన్నం, బంగాళాదుంప కూర, గోంగూర పచ్చడి, సాంబార్, పెరుగు’ వడ్డించామని ఒక పోస్ట్ పెట్టారు. డైలీ ఆయన చేస్తున్న ఈ పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ చూసిన నెటిజన్స్.. ఆయనను దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి ఎంతోమంది కడుపు నింపుతున్న ఈ యువకుడిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Teja Reddy (@mee.tejareddy)