వీడియో: వందే భారత్‌ రైల్లో పొగలు.. అసలు విషయం తెలిసి అందరూ షాక్‌!

బుధవారం సాయంత్రం వందే భారత్‌ రైలు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళుతోంది. రైలు మనుబోలు దగ్గరకు రాగానే ఒక్కసారిగా ఓ కంపార్ట్‌మెంట్‌లో పొగలు అలుముకున్నాయి. దీంతో కంపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సమాచారం తెలుసుకున్న లోకో పైలట్‌ రైలును ఆపేశాడు. రైలు సిబ్బంది ఆ పొగలు ఎక్కడినుంచి వస్తున్నాయా అని వెతకటం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత అసలు విషయం తెలిసి సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా షాక్‌ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

వందేభారత్‌ రైలు బుధవారం తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ బయలుదేరింది. ప్రయాణికులు ఎవరి సీట్లలో వాళ్లు కూర్చుని ఉన్నారు. ప్రయాణం ఎంతో సాఫీగా సాగుతోంది. ఇలాంటి సమయంలో సాయం కాలం వేళ ఓ అలజడి మొదలైంది. రైలులోని ఓ కంపార్ట్‌మెంట్‌లో పొగలు రావటం ప్రయాణికులు గుర్తించారు. ఆ పొగలు అంతకంతకూ పెరుగుతూ పోయాయి. దీంతో వారిలో భయం మొదలైంది. రైలు సిబ్బందికి ఈ సమాచారం ఇచ్చారు. రైలు సిబ్బంది వెంటనే లోక్‌ పైలెట్‌కు వాకీ టాకీ ద్వారా కంపార్ట్‌మెంట్‌లో పొగలు వస్తున్న విషయాన్ని చెప్పారు.

లోకో పైలెట్‌ వెంటనే రైలును నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్‌లో ఆపేశాడు. రైలు ఆగిన వెంటనే ప్రయాణికులు కిందకు పరుగులు తీశారు. ఇక, సిబ్బంది రంగంలోకి దిగి ఆ పొగలు ఎక్కడినుంచి వస్తున్నాయో వెతకటం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఆ పొగలు బాత్‌రూమ్‌నుంచి వస్తున్నాయని గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా అక్కడ ప్లాస్టిక్‌ వస్తువులు అంటుకుని ఉన్నాయి. వాటినుంచి పొగ వస్తూ ఉంది. అవి అలా అంటుకోవటానికి కారణం లేకపోలేదు.

వాటిపై కాల్చి పడేసిన సిగరెట్‌ పీక పడిఉంది. అందుకే అవి అంటుకున్నాయి. దీంతో పొగ వచ్చింది. అంతేకాదు! టికెట్‌ లేకుండా రైలులోకి ఎక్కి బాత్‌రూములో నక్కిన ఓ వ్యక్తి ఈ పని చేసినట్లు సిబ్బంది గుర్తించారు. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంటల్ని ఆర్పేసిన తర్వాత రైలు మళ్లీ ముందుకు కదిలింది. సదరు వ్యక్తి బాత్‌రూములో సిగరెట్‌ తాగటం వల్ల దాదాపు అరగంట పాటు ఆ రైలు నిల్చిపోవాల్సి వచ్చింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments