iDreamPost
android-app
ios-app

Annamayya district: తల్లిదండ్రులను కొట్టిన కసాయి కొడుకు అరెస్ట్! దిలీప్ సుంకర చొరవతో!

Annamayya District: రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లాలో ఓ కసాయి కొడుకు..తల్లిని జుట్టు పట్టుకుని కొట్టిన సంగతి తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా ప్రముఖ న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర్ చోరవతో ఆ వృద్ధులకు న్యాయం జరిగింది.

Annamayya District: రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లాలో ఓ కసాయి కొడుకు..తల్లిని జుట్టు పట్టుకుని కొట్టిన సంగతి తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా ప్రముఖ న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర్ చోరవతో ఆ వృద్ధులకు న్యాయం జరిగింది.

Annamayya district: తల్లిదండ్రులను కొట్టిన కసాయి కొడుకు అరెస్ట్! దిలీప్ సుంకర చొరవతో!

తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవమని పెద్దలు అంటుంటారు. నిజమే జీవితాన్ని ప్రసాదించి, పెంచి పెద్ద చేసి మన కాళ్ల మీద మనం నిలబడేటట్లు చేస్తారు. తమ రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలకు చదువులు చెప్పించి  పెంచుతారు తల్లిదండ్రులు. పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కష్టనష్టాలను ఓర్చి వారిని పెంచి పెద్దచేస్తుంటారు. కానీ కొందరు బిడ్డలు మానవత్వం మర్చిపోయి..తల్లిదండ్రులపై దారుణాలకు తెగబడుతున్నారు. ఇటీవలే రెండు రోజుల క్రితం ఓ అన్నయయ్య జిల్లాలో తల్లిదండ్రులను కాలితో తన్నుతో దారుణంగా కొట్టాడు ఓ కాసాయి కొడుతు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారి.. చివరకు ఆ కాసాయి కొడుకు కటకటలా పాలయ్యాడు. పూర్త వివరాల్లోకి వెళ్తే…

ఎన్నో కష్టాలు పడుతూ తమను పెంచి పెద్ద చేసిన అమ్మానాన్నలపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.  కొన్ని కొన్ని ఘటనలు చూస్తే.. రక్త సంబంధాల కంటే.. ఆర్థిక సంబంధాలే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ధనం, పొలం కోసం కన్నవారిని తోడబుట్టిన వారిని, కనిపెంచిన అమ్మనాన్నలపై దాడులకు పాల్పడుతున్నారు.  అలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

అన్నమయ్య జిల్లా  మదనపల్లిలో పెద్దకాము వెంకట రమణారెడ్డి(82), లక్షమ్మ(72) నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి కుమారులు ఒకడైన శ్రీనివాసరెడ్డి.. ఆ వృద్ధ దంపతులపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఓ ఆస్తి విషయంలో రమణారెడ్డి, లక్షమ్మలను దారుణంగా కొట్టాడు. సోదరుడి పేరు మీద ఆస్తి  రాశారనే కారణంతో వారిద్దరిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. తమను కొట్ట వద్దంటూ  చేతులు జోడించి.. వేడుకున్నా కూడా ఆ కసాయి కుమారుడు కనికరించలేదు. తల్లి గుండెలపై కాలితో దన్నుతు పశువు కంటే హీనంగా ప్రవర్తించాడు.

ఇలా ఆ వృద్ధులపై జరిగిన దాడి ఘటనను స్థానికులు ఒకరు వీడియో తీశారు. దీంతో ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు. అయితే ఘటనను చూసి చాలా మంది స్పందించారు. అలానే ఘటనపై ప్రముఖ న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర స్పందించారు. అంతేకాక ఆ తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. చివరకు నిందితుడిని అరెస్ట్ అయ్యేలా కల్యాణ్ దిలీప్ సుంకర్ చేశారు.

ఆయన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేశారు. గతంలో కూడా తల్లిదండ్రును చంపుతానని బెదిరించాడని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తంగా తనను ఏమి చేయలేరులే అని విర్రవీగి..తల్లిదండ్రులపై దాడికి చేసిన ఆ కసాయి కొడుకును కల్యాణ్ దిలీప్ సుంకర్ అరెస్టు చేయించారు. దీంతో ఆయనపై  అభినందనలు వెల్లువెత్తున్నాయి. తల్లిదండ్రులను వేధించే కుమారులకు ఈ అరెస్టు ఓ గుణపాఠం అవుతుందని స్థానికులు అభిప్రాయా పడుతున్నారు.