Venkateswarlu
Venkateswarlu
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. తీవ్ర అల్పపీడన కారణంగా సముద్రం 10 మీటర్లు వెనక్కి వెళ్లిపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద వరద 50 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌లో నీటి మట్టం 12.7 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం నుంచి 11.60 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక, కోనసీమలో గోదావరి ఉపనదులైన వశిష్ట, వైనతేయ, గౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో లంక గ్రామాలకు వెళ్లే కాజ్ వేలపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, గత రెండు, మూడు రోజులనుంచి ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఇటు తెలంగాణలో కూడా వర్షాలు భీభత్సంగా కురుస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో ఏకంగా 616.5 మిల్లీ మీటర్ల వర్షపాతం పడింది. మరి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.