iDreamPost
android-app
ios-app

ఏపీకి మరో అల్పపీడన ముప్పు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

  • Published Sep 03, 2024 | 5:28 PM Updated Updated Sep 03, 2024 | 5:28 PM

AP Rains: ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. భారీగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఏపీకి మరో అల్పపీడన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

AP Rains: ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. భారీగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఏపీకి మరో అల్పపీడన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

  • Published Sep 03, 2024 | 5:28 PMUpdated Sep 03, 2024 | 5:28 PM
ఏపీకి మరో అల్పపీడన ముప్పు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కుండపోత వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నది ఉగ్రరూపందాల్చడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో భారీగా కురిసిన వర్షాలతో చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. ఇప్పటికే విజయవాడ నగరం వరద నీటిలో చిక్కుకుంది. వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ స్థంబించిపోయింది. వరదల కారణంగా ఆహారం, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మరో పిడుగు లాంటి వార్తను అందించింది వాతావరణ శాఖ. ఏపీకి మరో అల్పపీడన ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది.

వర్షాలు, వరదల నుంచి తేరుకుంటున్న ఏపీకి మరో అల్పపీడనం పొంచి ఉండడంతో ప్రజల్లో మళ్లీ కలవరం మొదలైంది. ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడిస్తోంది. అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు మారుతున్నాయని.. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కృష్ణా జిల్లా.. గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది.. ఎన్టీఆర్‌ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss