iDreamPost
android-app
ios-app

ఎన్నికల ప్రచారంలో వెంకటేశ్ పెద్ద కూతురు.. ఏ రాష్ట్రంలో అంటే?

  • Published May 01, 2024 | 6:05 PM Updated Updated May 01, 2024 | 6:05 PM

విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ తరఫున ఆమె క్యాంపెయినింగ్ చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ తరఫున ఆమె క్యాంపెయినింగ్ చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 01, 2024 | 6:05 PMUpdated May 01, 2024 | 6:05 PM
ఎన్నికల ప్రచారంలో వెంకటేశ్ పెద్ద కూతురు.. ఏ రాష్ట్రంలో అంటే?

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికల హీట్ నడుస్తోంది. భానుడి భగభగల కంటే రాజకీయాల వేడి అధికంగా ఉంది. ఎలాగైనా ఎలక్షన్స్​లో గెలవాలని అన్ని పార్టీలు ఫిక్స్ అయ్యాయి. అందుకే ఎండ వేడిని కూడా లెక్క చేయకుండా ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో మునిగిపోయారు. ఓటర్ల మనసులు గెలుచుకునేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. నిత్యం రోడ్​ షోలు, భారీ బహిరంగ సభలతో ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు రాబట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో సినిమా టచ్ అంతగా లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు పెద్దగా పార్టీ ప్రచారాల్లో కనిపించడం లేదు. అయితే విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు పొలిటికల్ క్యాంపెయిన్ చేయడం ఇంట్రెస్టింగ్​గా మారింది.

హీరో వెంకటేశ్ పెద్ద కూతరు అశ్రిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన మామయ్య రఘురామ రెడ్డి కోసం ఆమె క్యాంపెయిన్ నిర్వహించారు. ఖమ్మంలో జరిగిన మీటింగ్​లో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఈ సమావేశానికి హాజరయ్యారు అశ్రిత. రఘురామ రెడ్డిని గెలిపించాలని ప్రజలను ఆమె కోరారు. తెలంగాణలోని ఖమ్మం లోక్​సభ స్థానం మీద ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. దీనికి కారణం ఇక్కడ తీవ్ర పోటీ ఉండటమే. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్​రావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హీరో వెంకటేశ్ వియ్యంకుడు రామసహాయం రఘురామ రెడ్డి కూడా ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు.

రఘురామ రెడ్డి పోటీ చేస్తుండటంతో ఎలక్షన్ క్యాంపెయిన్​లో వెంకటేష్ పాల్గొంటారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయనకు బదులుగా కుమార్తె అశ్రిత రంగంలోకి దిగారు. ఖమ్మం మీటింగ్​లో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆమె జోరుగా ప్రచారం చేశారు. రఘురామ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆమె చాలా యాక్టివ్​గా కనిపించారు. అశ్రిత ఎన్నికల ప్రచార వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. వెంకటేశ్ పెద్ద కూతురు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.