iDreamPost
android-app
ios-app

ఆగస్టు నెలలో పాఠశాలలకు ఏకంగా 9 రోజులు సెలవులు.. విద్యార్థులకు పండగే!

  • Published Jul 30, 2024 | 4:44 PM Updated Updated Jul 30, 2024 | 4:44 PM

List Of Holidays In August Month: నెలాఖరు వచ్చిందంటే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తర్వాత నెలలో వచ్చే సెలవులను లెక్కబెట్టుకుంటూ ఉంటారు. ఇంకో రోజుతో జూలై నెల పూర్తై ఆగస్టు నెల వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఆగస్టు నెలలో ఎన్ని రోజులు సెలవులు అని లెక్కబెట్టుకునే పనిలో ఉంటారు విద్యార్థులు. మరి ఆగస్టు నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి. 

List Of Holidays In August Month: నెలాఖరు వచ్చిందంటే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తర్వాత నెలలో వచ్చే సెలవులను లెక్కబెట్టుకుంటూ ఉంటారు. ఇంకో రోజుతో జూలై నెల పూర్తై ఆగస్టు నెల వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఆగస్టు నెలలో ఎన్ని రోజులు సెలవులు అని లెక్కబెట్టుకునే పనిలో ఉంటారు విద్యార్థులు. మరి ఆగస్టు నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి. 

ఆగస్టు నెలలో పాఠశాలలకు ఏకంగా 9 రోజులు సెలవులు.. విద్యార్థులకు పండగే!

సెలవులంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు. హాస్టల్స్ లో చదువుకునే విద్యార్థులు, రోజూ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఇలా వీరంతా సెలవుల కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తుంటారు. సెలవు వస్తే ఇంటికెళ్ళిపోయి అమ్మ చేతి వంట తినాలని.. బయట ఫ్రెండ్స్ తో ఆడుకోవాలని.. సరదాగా గడపాలని అనుకుంటారు. అయితే సెలవుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఆగస్టు నెల ఎక్కువగానే సెలవులను పట్టుకొచ్చేసింది. రెండవ శనివారం, స్వాతంత్య్ర దినోత్సవం ఇలా పలు పండగలు, ఆదివారాలు అన్నీ కలిపి మొత్తం 9 రోజులు సెలవులు ఉన్నాయి. మరి ఏ ఏ రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.   

ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు సంబంధించి సెలవుల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ అకడమిక్ ఇయర్ 2024-25 ప్రకారం మొత్తం 232 పని దినాలు కాగా 83 రోజులు సెలవులు ఉన్నాయి. ఆగస్టు నెలలో 31 రోజులకు గాను 24 పని దినాలు ఉన్నాయి. అంటే 7 రోజులు సెలవులు. అయితే వరలక్ష్మి వ్రతం, రాఖీ పూర్ణిమ కారణంగా మరో రెండు రోజులు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు 4న ఆదివారం నాడు, ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం నాడు, ఆగస్టు 16న శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 18న ఆదివారం, ఆగస్టు 19న రాఖీ పూర్ణిమ/శ్రావణ పూర్ణిమ, ఆగస్టు 25న ఆదివారం, ఆగస్టు 26 సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెలవులు ఉన్నాయి. ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పాఠశాలలకు మొత్తం 9 రోజులు సెలవులు ఉన్నాయి. తెలంగాణలో కూడా 9 రోజులు సెలవులు ఉన్నాయి. 

వరుసగా సెలవులు:

ఆగస్టు 10, 11 తేదీల్లో శనివారం, ఆదివారం కారణంగా వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. అలానే ఆగస్టు 15న గురువారం, ఆగస్టు 16న శుక్రవారం వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. మధ్యలో శనివారం పాఠశాలకు వెళ్తే మళ్ళీ వరుసగా 18న అంటే ఆదివారం, ఆగస్టు 19న రక్షా బంధన్ సందర్భంగా రెండు రోజులు సెలవులు వస్తాయి. మరలా ఆగస్టు 25న ఆదివారం, 26న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వరుసగా రెండు రోజులు సెలవులు వస్తాయి. మొత్తం 9 రోజులు సెలవులు ఉన్నాయి. ఆగస్టు 15, 16, 18, 19న 4 రోజులు సెలవులు ఉన్నాయి. మధ్యలో ఒకే ఒక్క రోజు వర్కింగ్ డేగా ఉన్న శనివారం సెలవు ఇస్తే కనుక వరుసగా 5 రోజులు సెలవులు కలిసి వచ్చే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు సెలవులు అయితే ఉన్నాయి. ఇంకొక రోజు సెలవు ఉండే అవకాశం ఉంది.  

ఇక తమిళనాడు విషయానికొస్తే.. జూన్ 10 నుంచి 2024-25 అకడమిక్ ఇయర్ ప్రారంభమైంది. అలానే ప్రస్తుత అకడమిక్ ఇయర్ కి సంబంధించి క్యాలెండర్ ని కూడా పబ్లిష్ చేశారు. అయితే ఈ క్యాలెండర్ లో సాధారణం కంటే 10 రోజులు అదనపు పని దినాలు ఉన్నాయి. దీంతో 220 రోజులు పాఠశాలలు తెరిచే ఉంటాయి. దీని కోసం వివిధ శనివారాల్లో పాఠశాలలు పని చేస్తాయని క్యాలెండర్ లో పేర్కొన్నారు. దీని వల్ల ఉపాధ్యాయుల మీద, విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సెలవులు ప్రకటిస్తామని తెలిపారు. అకడమిక్ ఇయర్ లో ఇప్పటికే రెండు నెలలు అయిపోయాయి. ఆగస్టు నెల వచ్చేస్తుంది.

దీంతో విద్యార్థులు ఆగస్టు నెలలో వచ్చే సెలవులు ఎన్ని అని లెక్కపెట్టుకుంటున్నారు. ఆగస్టు 3న శనివారం, ఆగస్టు 4న ఆదివారం, ఆగస్టు 11న ఆదివారం, ఆగస్టు 15 సోమవారం నాడు స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 17న శనివారం నాడు, ఆగస్టు 18 ఆదివారం నాడు, ఆగస్టు 25 ఆదివారం నాడు, ఆగస్టు 26 సోమవారం నాడు కృష్ణ జన్మాష్టమి, ఆగస్టు 31 శనివారం నాడు సెలవు దినాలుగా ఉన్నాయని తమిళనాడు విద్యాశాఖ పబ్లిష్ చేసిన క్యాలెండర్ ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద ఆగస్టు నెలలో 9 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఆగస్టు నెలలో రెండు శనివారాలు మాత్రమే పని దినాలు. ఇది ఒక్కటి విద్యార్థుల్లో కాస్త నిరుత్సాహం కల్గించే అంశం.