iDreamPost
android-app
ios-app

అచ్యుతాపురం సెజ్ లో ఘోర ప్రమాద ఘటన.. కారణం ఇదేనా!

Atchutapuram Incident: అనకాపల్లి అచ్యుతాపురంలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు వల్ల సుమారు 18 మంది చనిపోయారు. ఈ ప్రమాదాానికి కారణం ఏమిటంటే..

Atchutapuram Incident: అనకాపల్లి అచ్యుతాపురంలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు వల్ల సుమారు 18 మంది చనిపోయారు. ఈ ప్రమాదాానికి కారణం ఏమిటంటే..

అచ్యుతాపురం సెజ్ లో ఘోర ప్రమాద ఘటన.. కారణం ఇదేనా!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అనే ఫార్మా కంపెనీలో బుధవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా.. 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేసే సిబ్బంది 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడారు. క్షతగాత్రుల్ని వివిధ ఆస్పత్రులకు తరలించగా.. అక్కడ వైద్యం కొనసాగుతోంది. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ భారీ ప్రమాదంపై అందరిలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అచ్చుతాపురం సెజ్ లోని ఎసెన్షియా కంపెనీలు పేలుడుకు పాతకాల రియాక్టర్ కావడమే కారణమని ఫార్మ రంగ నిపుణులు చెబుతున్నారు. ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లే అత్యంత కీలకం. వీటిల్లోనే రసాయనాలను మిశ్రమం చేస్తారు. ఈ కొలతల్లో తేడా వచ్చినా పీడనం, ఉష్టోగ్రతల్లో హెచ్చు తగ్గులు సంభవించినా ఈ రియాక్టర్లు ఒక్కసారిగా పేలిపోతాయి. ఇప్పుడు ఎసెన్షియా ఫార్మా కంపెనీలో కూడా రియాక్టర్ పేలడానికి ఎక్స్ థర్మల్ రియాక్షనే కారణమని నిపుణులు భావిస్తున్నారు. రియాక్టర్లలో ఆర్గానికి కాంపౌండ్స్ లో కర్బన రసాయనాలను కలిపే సమయంలోనే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. రియాక్టర్ నుంచి మరో రియాక్టర్ కి మిశ్రమం పంపిస్తున్న సమయంలో వ్యాపర్ క్లౌడ్ ఎక్స్ ప్లోషన్ జరిగింది.

వ్యాపర్ క్లౌడ్ ఎక్స్ ప్లోషన్ అనగా  ఒక రియాక్టర్ లోని మిశ్రమం అక్కడ ఉన్న ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకిచేరుకోవడం వల్ల ఆవిరి పీడనం పెరిగింది. ఈ క్రమంలో ఆవిరి పీడనం రియాక్టర్ లో ఎక్కువ కావడంతో ఒత్తిడి తారస్థాయికి చేరుకుని ఒక్కసారిగా పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇక ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. విశాఖ జిల్లా కలెక్టర్ ఈ ఎక్స్ గ్రేషియా వివరాలను ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు కలెక్టర్ హరిందర్ ప్రసాద్ తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు కూడా పరిహారం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాల ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు.