iDreamPost
android-app
ios-app

Lakshmi Parvathi: అత్తగా చంద్రబాబు బాగోతం నాకే తెలుసు: లక్ష్మీపార్వతి!

  • Published Feb 19, 2024 | 6:24 PM Updated Updated Feb 19, 2024 | 6:24 PM

తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విరుచకపడ్డారు. సోమవారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె..అత్తగా చంద్రబాబు భాగోతం తనకే తెలుసంటూ సెటైర్లు వేశారు.

తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విరుచకపడ్డారు. సోమవారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె..అత్తగా చంద్రబాబు భాగోతం తనకే తెలుసంటూ సెటైర్లు వేశారు.

  • Published Feb 19, 2024 | 6:24 PMUpdated Feb 19, 2024 | 6:24 PM
Lakshmi Parvathi: అత్తగా చంద్రబాబు బాగోతం నాకే తెలుసు: లక్ష్మీపార్వతి!

వైఎస్సార్ సీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్  నందమూరి లక్ష్మీపార్వతి..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై మరోసారి విరుచకపడ్డారు. తనదైన మాటలతో చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సెటైర్లు వేశారు. చంద్రబాబును ఓ రేంజ్ లో ఆడుకునే వారిలో లక్ష్మీ పార్వతి ఒకరు. ప్రతి సభలోనూ బాబుపై  తీవ్ర స్థాయిలో మండిపడుతుంటారు. సోమవారం ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన – మహిళ స్పందన’ రాష్ట్రస్థాయి మహిళా సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అల్లుడి భాగోతం అత్తగా తనకే  తెలుసు అంటూ సెటైర్లు వేశారు.

సోమవారం  జగన్ పాలన- మహిళ స్పందన పేరుతో రాష్ట్రా స్థాయి  మహిళా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు ఆడవాళ్లను అసహించుకుంటే.. మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి బలంగా నమ్మారని ఆమె తెలిపారు. రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి, అలాగే వైఎస్ జగన్ మహిళా సంస్కర్తని ఆమె కొనిడాయాడరు. మహిళ అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని ఆమె తెలిపారు.

ఇందిరాగాంధీ మహిళల స్థితిగతులను తెలుసుకునేందుకు రామచంద్రగుహ కమిటీ వేశారని, ఆ నివేదిక వచ్చిన తరువాత సాగిన ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల పరిస్థితి మారలేదని ఆమె తెలిపారు. ఇందిరా గాంధీ చేయలేని పనిని సీఎం జగన్‌ చేసి చూపించారని లక్ష్మీపార్వతీ అన్నారు. మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందని, అలానే దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం జగన్‌ ఒక్కరేనని ఆమె పేర్కొన్నారు. సీఎం జగన్ వయసులో చిన్నవాడే అయినా ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయని ఆమె తెలిపారు.

ఇదే సమయంలో చంద్రబాబు నాయుడిపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లుడి బాగోతం అత్తగా తనకే తెలుసని, టీడీపీ పాలనలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగిందని ఆమె ఆరోపించారు. అలానే చంద్రబాబు పనైపోయిందని, ముసలోడైపోయాడని, అందుకే తన కొడుకుని సీఎం చేయాలని బాబు ప్రయత్నిస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చారు.  చంద్రబాబు బాధితుల్లో తాను, తన భర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను తిట్టడానికే చంద్రబాబు సమావేశాలు పెడుతున్నాడని ఆమె అన్నారు. సన్నాసి అయిన లోకేష్‌ కావాలా?, మంచి వ్యక్తి అయిన జగన్ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆమె తెలిపారు. పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుందని ఏపీ ప్రజలకు ఆమె సూచించారు. మరి.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom