iDreamPost
android-app
ios-app

చంద్రబాబు తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టాడు: కేశినేని నాని

  • Published Mar 09, 2024 | 6:09 PM Updated Updated Mar 09, 2024 | 6:09 PM

Kesineni Nani: వైఎస్సార్ సీపీ కీలక నేతల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒకరు. టీడీపీ, చంద్రబాబుపై తరచూ ఫైర్ అయ్యే వైసీపీ నేతల్లో నాని ఒకరు. తాజాగా చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

Kesineni Nani: వైఎస్సార్ సీపీ కీలక నేతల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒకరు. టీడీపీ, చంద్రబాబుపై తరచూ ఫైర్ అయ్యే వైసీపీ నేతల్లో నాని ఒకరు. తాజాగా చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Published Mar 09, 2024 | 6:09 PMUpdated Mar 09, 2024 | 6:09 PM
చంద్రబాబు తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టాడు: కేశినేని నాని

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నేతల మధ్య మాటలు సెగలు రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు మాటలతో సమ్మర్ హీట్ చూపిస్తున్నారు. టీడీపీ నేతలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తుండగా.. వారికి కౌంటర్ గా వైఎస్సార్ సీపీ నేతలు, మంత్రులు మాట్లాడుతున్నారు. అలానే తాజాగా బీజేపీతో పొత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉండటంపై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.

శనివారం విజయవాడ ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి వివరించారు. అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. అలానే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలు చేస్తుండటంపై కూడా నాని స్పందించారు. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ కేశినేని నాని దుయ్యబట్టారు. నందమూరి తారక రామారావు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం  తెలుగు దేశం పార్టీని స్థాపించారని నాని అన్నారు. అలాంటి పార్టీని చంద్రబాబు నాశనం చేశాడని చెప్పుకొచ్చారు. మూడు రోజుల నుంచి  కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం చంద్రబాబు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని నాని దుయ్యబట్టారు.

చంద్రబాబు తన స్వార్థం కోసం  తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టాడని  నాని మండిపడ్డారు. ఎంత మంది కలిసొచ్చినా సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని ఓడించడం కలే అని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ 175కి 175కి సాధించడం ఖాయమన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. పవన్‌ జన సైనికుల ఆత్మ గౌరవాన్ని లోకేశ్, చంద్రబాబుల దగ్గర తాకట్టు పెట్టాడని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వార్ వన్ సైడేనని కేశినేని తేల్చి చెప్పారు. మొత్తంగా చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  ఎంపీ కేశినేని నాని.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం ఎవరైన టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తే.. వెంటనే స్పందిస్తుంటారు.  టీడీపీ నేతల కౌంటర్ కు అదే స్థాయిలో రీకౌంటర్ ఇస్తుంటారు కేశినేని నాని. మరి.. చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet