Dharani
Dharani
తన, పర బేధాలు లేకుండా.. ప్రజలందరూ నా వాళ్లు అనుకున్నవాడే నిజమైన నాయకుడు అవుతాడు. ఆపద అన్నవారిని ఆదుకుని.. కష్టంలో ఉన్న వారికి సాయం చేసి.. నేనున్నాంటూ భరోసా కలిగించేవాడే ప్రజల మది గెలిచిన నాయకుడు అవుతాడు. ఈ లక్షణాలన్ని పుణికి పుచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. గతంలో టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు కాదు కదా.. కనీసం పెన్షన్ డబ్బులు సక్రమంగా రావాలన్న ఎన్నో ఇబ్బందులు. ఏ పార్టీ, ఏ వర్గం ఇలా రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకుని మన అనుకున్నవారికి మాత్రమే ప్రభుత్వ సాయం అందించేవారు. కానీ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారింది.
పార్టీ, కులం వంటి విషయాలు కాదు.. ప్రభుత్వం అందించే సాయానికి వారు నిజంగానే అర్హులా కాదా అన్నది మాత్రమే చూస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందజేస్తూ.. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజల చేత నీరాజనాలు అందుకుంటున్నారు ఏపీ సీఎం.ఈ క్రమంలో తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నేతకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 20 లక్షల రూపాయలు మంజూరు చేసి.. మరోసారి రాష్ట్రంలోని ప్రజలంతా తనవారే అని నిరూపించుకున్నారు సీఎం జగన్. ఆ వివరాలు..
కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరానికి చెందిన టీడీపీ నాయకుకుడ, జన్మభూమి కమిటీ మాజీ సభ్యుడు కె. కృష్ణ గత కొంత కాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు భారీ మొత్తంలో డబ్బు అవసరం. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలో తన సమస్య గురించి ఏఎంసీ మాజీ ఛైర్మన్ మురళీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా చేయమని కోరారు. కృష్ణ పరిస్థితి తెలిసిన మురళీ.. ఈ విషయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి రాజా దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి చొరవతో.. కృష్ణ చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.20 లక్షలు మంజూరు చేశారు అధికారులు.
ఇందుకు సంబంధించి ఎల్‌ఓసీ పత్రాన్ని మంత్రి రాజా.. కృష్ణకు అందించారు. ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ పత్రాన్ని కృష్ణ భార్య లక్ష్మికి అందజేశారు. ప్రస్తుతం కృష్ణ విశాఖ మణిపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సాయాన్ని అందిస్తుందని తెలిపారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు తెలిపారు కృష్ణ కుటుంబ సభ్యులు.