SNP
SNP
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో రూ.371 కోట్ల అవినీతి జరిగినట్లు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని శనివారం ఏసీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ కోరుతూ సీఐడీ ఆయనను హాజరుపర్చింది. దాదాపు 8 గంటల వాదనల తర్వాత.. చంద్రబాబును 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆదివారం రాత్రి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు తరలించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే.. చంద్రబాబు అరెస్ట్‌పై కేవలం టీడీపీ, జనసేన మాత్రమే హడావిడి చేస్తుండగా.. మేధావి వర్గం సమంజసమే అంటూ మౌనం వహించింది. కానీ, కొంతమంది మాత్రం చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ లిస్ట్‌లో తెలుగు సినిమా అవుట్ డేటెడ్ డైరెక్టర్ కే.రాఘవేంద్ర రావు కూడా చేరారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్ర బాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి.’ అంటూ పేర్కొన్నారు.
రాఘవేంద్ర రావు ట్వీట్‌పై నెటిజన్లు మాత్రం వైల్డ్‌గా రియాక్ట్ అవుతున్నారు. అంబేద్కర్ విగ్రహాలు బాధపడుతున్నాయో లేదో తెలియదు కానీ, చంద్రబాబు అరెస్ట్‌తో ఎన్టీఆర్ విగ్రాహాలు మాత్రం ఆనందభాష్పాలు రాల్చుతున్నాయంటూ రాఘవేంద్రరావును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పైగా ఈ ట్వీట్‌తో రాఘవేంద్ర రావు కొత్త వివాదంలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తుంది. ట్వీట్‌లో చంద్రబాబును గారు అని సంభోదించిన రాఘవేంద్ర రావు.. అంబేద్కర్‌ను మాత్రం గారు అని సంభోదించలేదు. దీనిపై అంబేద్కరిస్టులు సైతం రాఘవేంద్ర రావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాఘవేంద్ర రావు క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది.
ఒక విజనరీ లీడర్ అయినటువంటి
నారా చంద్ర బాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం.ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి.
కె రాఘవేంద్ర రావు
— Raghavendra Rao K (@Ragavendraraoba) September 9, 2023
ఇదీ చదవండి: చంద్రబాబు తరపు లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి!