iDreamPost
android-app
ios-app

వాలంటీర్లపై TDP కుట్ర.. జర్నలిస్ట్ సాయి కీలక వ్యాఖ్యలు!

రాజకీయాల్లో చాలా వ్యూహాలు, ప్రణాళికలు ఉంటాయి. ప్రత్యర్థి పార్టీని ఎలా ఇరుకున్న పెట్టాలా అనే విధంగా రాజకీయ నాయకులు ప్లాన్ వేస్తుంటారు. కొన్ని పార్టీలు అయితే అధికారంతో సంబంధం లేకుండా తమకు ఉన్న పలుకుబడితో, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంతో ప్రత్యర్థి పార్టీని ఇబ్బందులకు గురి చేస్తుంటారు.

రాజకీయాల్లో చాలా వ్యూహాలు, ప్రణాళికలు ఉంటాయి. ప్రత్యర్థి పార్టీని ఎలా ఇరుకున్న పెట్టాలా అనే విధంగా రాజకీయ నాయకులు ప్లాన్ వేస్తుంటారు. కొన్ని పార్టీలు అయితే అధికారంతో సంబంధం లేకుండా తమకు ఉన్న పలుకుబడితో, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంతో ప్రత్యర్థి పార్టీని ఇబ్బందులకు గురి చేస్తుంటారు.

వాలంటీర్లపై TDP కుట్ర.. జర్నలిస్ట్ సాయి కీలక వ్యాఖ్యలు!

రాజకీయాల్లో చాలా వ్యూహాలు, ప్రణాళికలు ఉంటాయి. ప్రత్యర్థి పార్టీని ఎలా ఇరుకున్న పెట్టాలా అనే విధంగా రాజకీయ నాయకులు ప్లాన్ వేస్తుంటారు. కొన్ని పార్టీలు అయితే అధికారంతో సంబంధం లేకుండా తమకు ఉన్న పలుకుబడితో, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంతో ప్రత్యర్థి పార్టీని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అలా చేయడంలో తెలుగు దేశం పార్టీ ముందు ఉందని పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ.. ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తారని టాక్. అందుకు బలాన్ని చేకూరుస్తూ అనేక ఘటనలు జరిగాయి. తాజాగా వాలంటీర్ వ్యవస్థపై మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వాలంటీర్లపై టీడీపీ కుట్ర చేస్తుందనే సందేహం వ్యక్తమవుతుంది.  ఈ అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ సాయి కీలక విషయాలను వెల్లడించారు.

జర్నలిస్ట్ సాయి మాట్లాడుతూ…”టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ  సమస్యలు రాకూడదు. వ్యవస్థలని పర్ఫెక్ట్ గా పనిచేయాలి. అదే వేరే వాళ్లు అధికారంలోకి వస్తే.. వాళ్లని సరిగ్గా పని చేయనికూడదనే టీడీపీ ఉద్దేశం. వ్యవస్థల ద్వారా వాళ్లని అడ్డుకుంటాం. ఎన్జీటీ, కోర్టులు వంటి వాటి ద్వారా వివిధ రకాల ఫిర్యాదులు చేస్తూ.. ప్రభుత్వ పాలను స్థంభించాలనేది టీడీపీ ప్లాన్.  జగన్ మోహన్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు కాబట్టి.. టీడీపీ రకరకాలుగా అడ్డుకుంటుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా అలానే మూడు,నాలుగేళ్ల పాటు ఏ పని చేయనిచ్చే వాళ్లు కాదు. జల యజ్ఞంకి ఎన్నో అడ్డంకులు పెట్టారు. ఇప్పుడు ఉన్న పోతిరెడ్డి పాడు డ్యామ్ కి ఎన్నో అడ్డంకులు సృష్టించారు.

వ్యవస్థలు, కోర్టుల ద్వారా అడ్డుకోవడం టీడీపీకి అలవాటు. అదే పని వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం కోసం కూడా టీడీపీ చేస్తుంది.  నిమ్మగడ్డ ప్రసాద్ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడే టీడీపీ అనుకూలంగా.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు.

ఆ సమయంలో ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేశారని టాక్. ఇప్పటి వరకు ఏపీలో ఓటు హక్కులేని నిమ్మగడ్డ.. ఇటీవలే ఓటుహక్కు పొందారు. అయితే  ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థ కారణంగా నేరాలు, కిడ్నాప్ లు జరుగుతున్నాయని ఆ వ్యవస్థను, ఆ జీవోను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని.. రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న ప్రజలు చెప్పాలి.. కానీ ఆయన ఎవరు. ఇటీవలే ఓటుహక్కు తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఈ రాష్ట్ర పౌరుడే కాదు. మరీ… ఇప్పుడే ఆయన ప్రైవసీకి ఏం భంగం కలిగింది.

వాలంటీర్ల ద్వారా ప్రజలకు పొందే ప్రయోజనాలను ఆపాలని, గతంలో మాదిరి పార్టీ నాయకుల వద్ద ప్రజలు చేతులు కట్టుకునే పరిస్థితి కావాలి అనే పద్ధతిలోకి ఆయన తీసుకెళ్తున్నారు. ప్రజలకు ఇంటి వద్దకే సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలనేది కుట్ర.. ఇది మంచా, చెడా అనేది ప్రజలే తేలుస్తారు” అని జర్నలిస్ట్ సాయి చెప్పుకొచ్చారు. మరి.. సాయి చెప్పిన అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.