iDreamPost
android-app
ios-app

యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ ఎందుకు? దేశానికి ఏ విధంగా మేలు?

  • Published Jul 12, 2023 | 2:15 PMUpdated Jul 12, 2023 | 2:15 PM
  • Published Jul 12, 2023 | 2:15 PMUpdated Jul 12, 2023 | 2:15 PM
యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ ఎందుకు? దేశానికి ఏ విధంగా మేలు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అదే.. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌. ఒకే దేశం-ఒకే చట్టం నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విభిన్న మతాచారాలకు నిలయమైన భారతదేశంలో ఒకే చట్టం ఎలా సాధ్యమవుతుంది? ఇది కేవలం తమ మత హక్కులను కాలరాయడానికే అని కొంతమంది యూసీసీని వ్యతిరేకిస్తున్నారు. మరికొంత మంది యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను సమర్థిస్తున్నారు. అసలు.. ఈ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను ప్రజలు ఏ కోణంలో చూస్తున్నారు? నిజంగా దీని అవసరం దేశానికి ఉందా? యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ లక్ష్యం ఏంటి? అనే కీలక అంశాలపై మాజీ ఐఏఎస్‌ అధికారి జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ.. యూసీసీ గురించి వివరించే ప్రయత్నం చేశారు.

జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ.. యూసీసీ గురించి అర్థం కావాలంటే.. ముందు రాజ్యం, సమాజం, మతం పాత్ర గురించి తెలుసుకోవాలన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా రాజ్యం తన పాలన చేయాలి. అలాగే పౌరుల హక్కులకు భంగం కలిగితే.. రాజ్యం బలంగా పనిచేయాలి. ఇతరులకు ఎటువంటి హాని, ఇబ్బంది కలగనంత వరకు ఎవరైన తమ మతాచారాలను పాటించుకోవచ్చు. అది రాజ్యాంగం వారికిచ్చిన హక్కు. అయితే.. మతాచారాలతో ఆ మతంలోని మహిళల, పిల్లల ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మాత్రం రాజ్యం తన పాత్ర నిర్వర్తించాలి. అప్పుడు చట్టం చేయాల్సిన అవసరం ఉంది.

చాలా మతాల్లో మహిళలకు అన్యాయం జరుగుతోంది. వాటికి రాజ్యమే న్యాయం చేయాలి. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను ఈ కోణంలో చూడాలి తప్ప మతం కోణంలో కూడా కూడదు. తమ మతాచారాలను నాశనం చేసేందుకు చట్టం తెస్తున్నారని అనడం సరికాదు. ఆ మతాచారాల పేరుతో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే, ఛాం‍దసం, మూఢనమ్మకాలు పాటిస్తే రాజ్యం తన పని తాను చేయాల్సిందే. అయితే.. ఒక మతంపై ఆధిపత్యం చెలాయించేలా యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ ఉండకూడదు. కేవలం పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేదిగానే ఉండాలి. అంతకు మించి ఎక్కువగా కలగజేసుకోకూడదు అని ఆయన పేర్కొన్నారు. యూసీసీపై జయప్రకాశ్‌ నారాయణ విశ్లేషణను పూర్తిగా కింద ఉన్న వీడియోలో చూడొచ్చు. అలాగే యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పార్టీలకు కోట్లలో విరాళాలు! BJP, BRS, INC, YCP, TDP లెక్కలివే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి