Dharani
జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్ల విద్యార్థులకు ఎంత మేలు జరుగుతుందో చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యింది ఓ విద్యార్థిని. ఆ వివరాలు..
జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్ల విద్యార్థులకు ఎంత మేలు జరుగుతుందో చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యింది ఓ విద్యార్థిని. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ.. వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంటున్నారు. ఇక విద్యా రంగంలో జగన్ తీసుకువచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే అరకొర వసతులు, సిబ్బంది కొరత.. శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్‌లు ఇవే దర్శనం ఇచ్చేవి. ఇక పిల్లల చదువు గురించి పట్టించుకునే నాథుడే ఉండేవాడు కాదు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్.. ఏపీ విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టారు. నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చారు. మౌలిక సదుపాయాలు కల్పించి.. కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా వాటిని మార్చారు.
ఇక ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. పిల్లల చదువు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో వారి కోసం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, గోరుముద్ద పథకాలు ప్రారంభించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా.. ఏపీలో విద్యా రంగంపై భారీగా ఖర్చు చేస్తున్నారు సీఎం జగన్. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే ఫలితాలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏపీ విద్యార్థులు నేడు అంతర్జాతీయ వేదికల మీద అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో బీటెక్ విద్యార్థిని ఒకరు జగన్ ప్రభుత్వం వల్ల తమ కుటుంబానికి జరిగిన మేలు వివరిస్తూ.. ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది. ఆ వివరాలు..
నేడు సీఎం జగన్ కృష్ణా జిల్లా, పామర్రులో జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల కోసం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేశారు. ఈ సభలో విద్యాదీవెన లబ్ధిదారు శ్రీషణ్ముక సాయి ప్రియ అనే విద్యార్థిని మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యింది. జగన్ సర్కార్ వల్ల తాను చదువుకోడంతో పాటు.. తన కుటుంబానికి కూడా ఎంతో మేలు జరిగిందని.. చెప్పుకొచ్చింది. జగన్ లాంటి విజన్ ఉన్న వ్యక్తి సీఎంగా ఉన్నంతవరకు విద్యార్ధులకు వరమని.. దాని వల్ల తనలాంటి ఎంతోమంది చక్కగా చదువుకుంటున్నారన్నది. ప్రతిక్షణం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే జగనే మళ్లీ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నాము అన్నది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అన్న అనే పదానికి అసలైన ప్రతిరూపం మీరే జగనన్న..
అమ్మలా గోరుముద్దలు తినిపించి… నాన్న లా ఫీజులు కట్టి , పుస్తకాలిచ్చి , యూనిఫామ్ ఇచ్చి మమ్మల్ని ఉన్నత చదువులు చదివిస్తున్న మీకు రుణపడి ఉంటాం జగనన్నా
– విద్యార్థిని https://t.co/NLzx6UxaQY
— Rahul (@2024YCP) March 1, 2024