ప్రజల వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా అర్హులందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన “జగనన్న సురక్ష’ కు విశేష స్పందన వస్తుంది. ఈ ప్రోగ్రామ్ రికార్డు స్థాయిలో ఫలితాలను ఇస్తుంది. అన్ని వర్గాల కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మేలు చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అందుకే జూలై 1 తేదీ నుంచి సచివాలయాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపుల్లో ప్రజలను సమస్యలను పరిష్కరించి.. లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు.
ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సేవలు, పథకాలు అందించడమే లక్ష్యంగా కొనసాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వాలంటీర్లు ఇంటికే వచ్చి.. ఏవైనా సమస్యలున్నాయా?, ఏవైనా ధృవీకరణ పత్రాలు కావాలా?, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?.. అని అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వారీగా వాలంటీర్లు జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సేవలు అందిస్తుండే, మరొకవైపు క్యాంపుల ద్వారా అక్కడికక్కడే ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఓ మహోద్యమంగా కొనసాగుతోంది. అందుకు నిదర్శనమే ఇప్పటి వరకు ప్రజల అందిన సేవల వివరాల గణాంకాలు. రాష్ట్రంలో అర్హత ఉండీ కూడా ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరూ ఉండకూదన్న మహోన్నత ఆశయంతో ఏపీ ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జూలై 1న ప్రారంభించింది. జూలై 31 వరకు కొనసాగనున్నా ఈ కార్యక్రమంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో ప్రజలకు చేరువైంది. నేటి వరకు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 1,26,06,648 కుటుంబాల కు చేరువైంది. అలానే 71,03,658 సర్టిఫికెట్లను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అలానే సమస్యలను పరిష్కరించేందుకు, సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఇప్పటి వరకు 12, 486 ప్రత్యేక క్యాంపులను నిర్వహించింది.
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వార స్పష్టమైన పురోగతిని సృష్టించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం అచంచలమైన అంకితభావానికి నిదర్శనమే ఈ గణాంకాలు. జూలై 31 వరకు సమయం ఉండటంతో ఈ గణాంకాలు భారీగా పెరగుతాయని రాజకీయా విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కాకారం అవుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలతో సీఎ జగన్ మోహన్ రెడ్డి.. ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించారు. మరి.. జగనన్న సురక్ష కార్యక్రమంపై విడుదలైన గణాంకాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ప్యాకేజ్ స్టార్ పదేళ్లుగా చంద్రబాబు వాలంటీర్‌గా పని చేస్తున్నాడు: సీఎం జగన్