iDreamPost
android-app
ios-app

‘జగనన్న సురక్ష’ కార్యక్రమంపై ప్రజల నుంచి భారీ స్పందన!

‘జగనన్న సురక్ష’ కార్యక్రమంపై ప్రజల నుంచి భారీ స్పందన!

ఏపీ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా  1.38 కోట్ల కుటుంబాలను  ఇంటి వద్దే కలుసుకోవడం ద్వారా పెండింగ్ సమస్యలు లేకుండా యంత్రాంగం జల్లెడ పట్టింది. జూన్ 23వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం నేటితో ముగియనుంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. జగనన్న సురక్ష కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం రాష్ట్రంలో రికార్డు సృష్టించింది. అర్హత ఉండి కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ పథకాలు అందకుండా ఉండకూడదన్న గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం ‘జగనన్న సురక్షా’ కార్యక్రమాన్ని జూలై 1న లాంఛనంగా ప్రారంభమైంది. విద్యాసంస్థల ప్రారంభం, అడ్మిషన్ల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని సురక్షా శిబిరాల్లోనే  పలు రకాల ధృవీకరణ పత్రాలను కూడా మంజూరు చేయించింది. వివిధ శాఖలు జారీ చేసే 11 రకాల ధృవీకరణ పత్రాలను ఎటువంటి  రుసుము లేకుండా అక్కడికక్కడే ప్రజలకు అందజేస్తోంది.

‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజు నుంచే ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. మొదటిరోజు మొత్తం 1305 సచివాలయాల పరిధిలో 4,73,930 వినతులు వస్తే వాటిల్లో ప్రభుత్వం అక్కడిక్కడే పరిష్కరించినవి 4,57,642 ఉన్నాయి. అలానే జూలై 31వ తేదీ నాటికి మొత్తం 15,004 సచివాలయాల పరిధిలో ఉన్న 1.42 కోట్ల కుటుంబాల నుంచి 95.96 లక్షల వినతులు వచ్చాయి. అందులో 93.36 లక్షల వినతులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. జూలై 18వ తేదీ ఒకరోజే 7.54లక్షలకు పైగా వినతులు పరిష్కారం కావడం విశేషం. జగనన్న సురక్షా శిబిరాల కోసం మొత్తం 2.68 లక్షల మంది వాలంటీర్లు.. తమ క్లస్టర్లలోని 1.42 కోట్ల కుటుంబాల్లో సర్వే నిర్వహించారు. అత్యధికంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగాయి.

ఈ జిల్లా నుంచి 7,65,722 అభ్యర్థనలు వస్తే… అధికారులు 7,62,655 పరిష్కరించారు. అలాగే అత్యల్పంగా పార్వతీపురం జిల్లా నుంచి 1,27,474 అభ్యర్థనలు రాగా 1,22,300 పరిష్కారమయ్యాయి. 45.33 లక్షలఇంటిగ్రేటెడ్ సరిఫికెట్లు, 41.50 లక్షల ఆదాయ ధృవీకరణ పత్రాలు, 7,326 ఓబీసి సర్టిఫికెట్లు, 2,366 వివాహ ధృవీకరణ పత్రాలు, 16,373 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, 1,40,114 అడంగల్ సర్టిఫికెట్లు, 2,70,194 వన్ బీ సర్టిఫికెట్లు జారీ చేశారు. తాము రోజుల తరబడి ప్రభుత్వ ఆఫీస్ ల చుట్టూ తిరిగి పనులు కాక ఇబ్బందులు పడే రోజులు పోయాయని జగనన్న ప్రభుత్వంలో అధికారులతో ఏ పనీ ఉన్నా సులభంగా పూర్తవుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి.. జగనన్న సురక్ష కార్యక్రమ సర్వే గణాంకాలపై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.

ఇదీ చదవండి: ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్! ఆగష్టు10న సున్నా వడ్డీ కార్యక్రమం..