Krishna Kowshik
నవ రత్నాల పేరిట ఏపీలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్.. ఇప్పుడు సంక్రాంతిని పురస్కరించుకుని ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
నవ రత్నాల పేరిట ఏపీలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్.. ఇప్పుడు సంక్రాంతిని పురస్కరించుకుని ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
Krishna Kowshik
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పాలనగా నిలుస్తోన్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగులకు బాసటగా నిలుస్తోంది. మొన్నటికి మొన్న దసరా కానుకగా.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరేజేషన్ చేస్తూ దానికి సంబంధించిన గైడ్ లైన్స్ జారీ చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఆలస్యంగా చెల్లిస్తున్న ఉద్యోగుల విధులకు సంబంధించి అలవెన్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జనవరి 1వ తేదీ నుండి జీతాలతో పాటు అలవెన్సులు చెల్లిస్తోంది జగన్ సర్కార్. అలాగే ఇప్పుడు సంక్రాంతిని పురస్కరించుకుని మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి కొత్త వేతనాలను చెల్లించనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే నైట్ హల్ట్ అలవెన్సు అందివ్వనుంది.
ఎప్పటి నుండో ఆర్టీసీ ఎంప్లాయిస్ చేస్తున్న డిమాండ్లను పరిష్కరిస్తోంది. ఇందులో భాగంగా నైట్ హాల్డ్ అలవెన్స్ ఫిబ్రవరి ఒకటిన జీతంతో పాటు ఇచ్చేందుకు సంస్థ ఈడీ బ్రహ్మానంద రెడ్డి హామీ ఇచ్చారని ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది. సోమవారం ఆయనతో ఎంప్లాయిస్ యూనియన్ నేతలు చర్చలు చేపట్టగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మిగిలిన భత్యాలు, బకాయిలతో సహా ఉద్యోగులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైమ్ అలవెన్సులను కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఇప్పటి వరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తోంది ప్రభుత్వం. ఇక వాటిని సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటుంది.
2017 నాటి పే రివిజన్ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం ట్రస్ట్ కు చెల్లించాల్సిన మొత్తాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. వాటన్నింటిని క్లియర్ చేయాలంటూ ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. తాజాగా నైట్ హాల్ట్ అలవెన్సులను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఫిబ్రవరి 1వ తేదీన అందే వేతనంతో నైట్ హాల్ట్ అలవెన్సులను కలిసి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రజల పట్లే కాకుండా ఉద్యోగులు, వారి డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందిస్తున్న జగన్ ప్రభుత్వంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.