iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్!

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తనదైన పాలనతో ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. నవరత్నాల పేరుతో అనేక పథకాలను పేద ప్రజలకు అందిస్తూ.. వారికి ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారు. అలానే పేదల అభివృద్ధి కోసం పలు పథకాలను అమలు చేస్తున్నారు. అలానే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా సీఎం జగన్  అనేక గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో సీపీఎస్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న ఉద్యోగులకు  శుభవార్త చెప్పింది. ఇలా తరచూ ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తూనే ఉంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ ఓ శుభవార్త చెప్పింది.

ప్రభుత్వ ఉద్యోగల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 12వ పీఆర్సీ ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వూలను జారీ చేసింది.  ఈ పీఆర్సీ కి  రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ ఛైర్మన్ గా వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై ఈ కమిషన్ నివేదికను రూపొందించనుంది. ఏడాదిలోగా పీఆర్సీకి సంబంధించిన వివిధ అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ తన సిఫార్సులను రూపొందించాలని సూచించింది.

అలానే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, కేటగిరీలకు చెందిన ఉద్యోగులందరి వివరాలు, వారికి సంబంధించిన అంశాలపై  అధ్యాయనం చేయాలని తెలిపింది.  వీటితో పాటు స్థానిక పరిస్థితులు, డీఏలపై  అధ్యయం చేసిన తరువాత సిఫార్సులు చేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. 12వ పీఆర్సీ  ఛైర్మన్‌గా మన్మోహన్‌సింగ్‌ను నియమించడంపై ఏపీ జేఏసీ ఛైర్మన్‌, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, హృదయరాజు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, అధికారులతో పే రివిజన్ కమిటీ చర్చించనుంది. మరి.. జగన్ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి