iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్… ఈ జిల్లాల్లో అత్యవసరమైతేనే బయటకు రండి!

Rain Alert In AP: గతమూడు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారటంతో భారీ వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలకు అధికారులు కీలక అలెర్ట్ జారీ చేశారు.

Rain Alert In AP: గతమూడు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారటంతో భారీ వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలకు అధికారులు కీలక అలెర్ట్ జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్… ఈ జిల్లాల్లో అత్యవసరమైతేనే బయటకు రండి!

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గతమూడు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారటంతో ఈవానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడనం ప్రస్తుతం వాయవ్య దిశగా పయనించి ఒడిశాలోని  పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇక బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదే విధంగా పార్వతీపురం మన్యం,నంద్యాల, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.  ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావారి జిల్లాలో, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.

ఇక పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలకు అధికారులు సూచించారు. అత్యవసమైతే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపారు. ఏపీలో సగటున గంటకు 19 నుంచి 23 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.  ఇక భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరం అయినేతే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి