తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు

ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు వాతవరణ శాఖ బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. మరోసారి తెలుగు రాష్ట్రాల్లోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, వాతవరణశాఖ హెచ్చరించింది.

ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు వాతవరణ శాఖ బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. మరోసారి తెలుగు రాష్ట్రాల్లోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, వాతవరణశాఖ హెచ్చరించింది.

మొన్న మొన్నటి వరకు భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు వణికించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఆ భారీ వర్షాలు, వరదల ఉద్ధృతి నుంచి ప్రజలు మెల్లగా కోలుకుంటున్న సమయంలో.. మరోసారి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. మరోసారి రెండు రాష్ట్రాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ప్రస్తుతం ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతుంది. దీంతో పశ్చిమ దిశ నుంచి విపరీతమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఏపీ, తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నాయని తాజాగా వాతవరణ శాఖ తెలిపింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఏపి, తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ ను జారీ చేసింది వాతవరణ శాఖ. ముఖ్యంగా నేటి నుంచే  రెండు రాష్ట్రాల్లో  వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో అగ్నేయంగా వాయుగుండం ఏర్పడటంతో దీని ప్రభావం రానున్న మూడు రోజుల్లో అనగా.. సెప్టెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు  తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరించింది. ఇకపోతే ఏపీలో రానున్న మూడు రోజులు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, అంతేకాకుండా.. పలు జిల్లాల్లో నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే నేడు ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని APSDMA వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, ఉ.గో, కృష్ణా, NTR, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఇకపోతే తెలంగాణలో కూడా రానున్న మూడు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా సెప్టెంబర్ 21వ తేదీన తెలంగాణలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే నేడు తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చిరు జల్లు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.  రేపు శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ముఖ్యంగా రేపు ఆదిలాబాద్, భూపాల్ పల్లి, ములుగు, కొత్త గూడెం, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల,జనగాం, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ అధికారులు సూచించారు.

Show comments