iDreamPost
android-app
ios-app

బంగాళాతంలో వాయుగుండం… తెలుగు రాష్ట్రాలకు భారీ వానాలు!

Rain Alert: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం బలపడింది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించింది.

Rain Alert: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం బలపడింది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించింది.

బంగాళాతంలో వాయుగుండం… తెలుగు రాష్ట్రాలకు భారీ వానాలు!

గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వానాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వానాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి బలపడింది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోనే ఆ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వానాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అలెర్ట్ గా ఉండాలని  వాతావరణ శాఖ సూచిస్తుంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసింది. శుక్రవారం అది వాయుగుండా మారి..నేడు బలపడింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక  ఈ వాయుగుండం తీవ్రంగా మారేం అవకాశం ఉందని, ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉండనుందని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో శనివారం సాయంత్రం మోస్తారు నుంచి తేలికపాటి వానాలు కురిసే అవకాశం ఉందని ఉందని పేర్కొంది.

ఈ తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో  భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ  వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు అధికారులు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతోపాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో కూడా మరో మూడు రోజుల పాటు భారీ వానలు పడనున్నాయని పేర్కొంది. ఈ మేరకు కోస్తా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. అలానే మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారవణ శాఖ చెప్పింది. ప్రస్తుతం తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు వీస్తుండటంతో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు  అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్లలలో నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు. ఇక వాన కారణంగా నేడు పాఠశాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి