Krishna Kowshik
తమ భార్యలు తమకు కావాలంటూ ఇద్దరు తోడళ్లుల్లు రోడ్డెక్కిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. కలెక్టర్ కే విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ఏం జరిగిందంటే...?
తమ భార్యలు తమకు కావాలంటూ ఇద్దరు తోడళ్లుల్లు రోడ్డెక్కిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. కలెక్టర్ కే విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ఏం జరిగిందంటే...?
Krishna Kowshik
ఆడ పిల్లలు పుడితే గుండెలపై కుంపటి అనుకునే రోజులు మారాయి. అమ్మాయి పుడితే కొడుకుతో సమానంగా చూడటమే కాదు.. ఆమె ఎంత వరకు చదువుకుంటానంటే అంత చదివిస్తున్నారు. అప్పటి వరకు పెళ్లి ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు. అలా గే ఆమెకు ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతున్నారు పేరెంట్స్. సాధారణంగా ఆడపిల్ల కాపురం బాగుండాలని, అల్లుడు ఆమెను బాగా చూసుకోవాలని తాపత్రయపడుతుంటాడు తండ్రి. అందుకే పెళ్లి సమయంలో భారీ కట్న కానుకలు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు. అలాగే వివాహం ముగిసిన తర్వాత కూడా అల్లుడు ఇంటికి వచ్చిన ప్రతిసారి రాచమర్యాదలతో సత్కరిస్తుంటాడు. అతడికి ఎటువంటి లోటు రానివ్వకుండా చూసుకుంటాడు. కానీ ఈ తండ్రి కూతుళ్లకు పెళ్లి చేసి కాపురానికి పంపకుండా.. తన వద్దే అట్టిపెట్టుకున్నాడు. దీంతో అల్లుళ్లు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తమ భార్యలను కాపురానికి పంపాలంటూ భర్తలు నిరసన తెలపడమే కాదు.. ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరుకు చెందిన బూరుగడ్డ శ్రీనివాస రామానుజ అయ్యంగార్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెను 2015లో గుజరాత్‌లో ఉద్యోగం చేస్తున్న వి పవన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి ఓ బిడ్డ ఉంది. కానీ రెండేళ్లకే కూతుర్ని ఇంటికి తెచ్చేసుకున్నాడు రామానుజ. అప్పటి నుండి కాపురానికి పంపలేదు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో కుమార్తెను విజయవాడకు చెందిన విబి శేషసాయికి ఇచ్చి వివాహం చేశాడు. పెళ్లైన కొన్ని రోజులకే చిన్న కూతుర్ని కూడా పుట్టింటికి తీసుకువచ్చి.. కాపురానికి పంపలేదు.
అయితే కూతుళ్లను కాపురానికి పంపాలని అల్లుళ్లు కోరడంతో వారిని వేధించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా వీరిపై పోలీసు కేసులు పెట్టించాడు. మామకు స్థానిక పోలీసు డిపార్టమెంట్‌లో పలుకుబడి ఉందని, అందుకే తమకు న్యాయం జరగడం లేదని భావించిన తోడళ్లుల్లు ఏలూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కుమార్తెళను కాపురానికి పంపాలని కోరుతుండటంతో మామ మమ్మల్ని వేధించడమే కాకుండా తమపై, తమ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టించాడని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. భార్యలను తమతో కాపురానికి పంపించే విధంగా అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తమపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. అలాగే బ్యానర్ చేయించి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు.