iDreamPost
android-app
ios-app

‘సిద్ధం’ సభ సూపర్‌ డూపర్‌ హిట్టు.. టీడీపీ ఫేక్‌ ప్రచారానికి చెక్‌ పెట్టే ప్రూఫ్‌

  • Published Mar 11, 2024 | 11:31 AM Updated Updated Mar 11, 2024 | 11:31 AM

Siddham Sabha, Addanki: వైఎస్సార్ సీపీ నిర్వహించిన సిద్ధం సభ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే దీనిపై టీడీపీ అసత్య ప్రచారానికి తెరతీసింది. అయితే వారి ఫేక్ ప్రచారానికి చెంప పెట్టులూ సిద్ధం సభకు సంబంధించిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

Siddham Sabha, Addanki: వైఎస్సార్ సీపీ నిర్వహించిన సిద్ధం సభ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే దీనిపై టీడీపీ అసత్య ప్రచారానికి తెరతీసింది. అయితే వారి ఫేక్ ప్రచారానికి చెంప పెట్టులూ సిద్ధం సభకు సంబంధించిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

  • Published Mar 11, 2024 | 11:31 AMUpdated Mar 11, 2024 | 11:31 AM
‘సిద్ధం’ సభ సూపర్‌ డూపర్‌ హిట్టు.. టీడీపీ ఫేక్‌ ప్రచారానికి చెక్‌ పెట్టే ప్రూఫ్‌

ఆదివారం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మేదరమెట్ల వద్ద వైఎస్సార్ సీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభ కుంభమేళాను తలపించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ సునామీకి తాజా సభ మరో సంకేతమని పొలిటికల్ ఎనలిస్టులు స్పష్టం చేస్తున్నారు. మేదరమెట్ల, రేణంగివరం మధ్య జాతీయ రహదారికి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో నిర్వహించిన సిద్ధం సభ జన సముద్రాన్ని తలపించింది. ఇక ఈ సభపై టీడీపీ పనిగట్టుకుని అసత్య ప్రచారానికి తెరతీసింది.  గ్రీన్ మ్యాట్, గ్రాఫిక్స్ అంటూ అనేక ఫేక్ ప్రచారాలు చేసింది. అయితే వారికి సమాధానంగా సిద్ధం సభకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్సార్ సీపీ  సిద్ధం పేరుతో సమర శంఖారావన్ని పూరించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఉత్తరాంధ్రలో జనవరి 27న నిర్వహించిన భీమిలి సభ, ఉత్తర కోస్తాలో ఫిబ్రవరి 3న జరిగిన దెందులూరు సభ, అలానే రాయలసీమలో ఫిబ్రవరి 18న నిర్వహించిన రాప్తాడు సిద్ధం సభలు ఒకదానికి మంచి మరొకటి అద్భుత విజయాన్ని అందుకున్నాయి. వాటికి మించి ఆదివారం మేదరమెట్లలో జరిగిన సిద్ధం నాలుగోవ సభ సూపర్‌ హిట్‌  అయ్యింది. దీంతో సీఎం జగన్‌ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల సన్నాహక సభలు ఈ స్థాయిలో గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వణికిపోతున్నారు.

ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో సిద్ధం నాలుగోవ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇది సభ అనడం కంటే.. రాజకీయ కుంభమేళా అని అంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బాపట్లలోని సముద్రం.. అద్దంకిలో జనసంద్రంగా మారింది. ఇసుక వేస్తే రాలనంత జనం సిద్ధం సభలో కనిపించింది. సభ ప్రాంగంణం నిండిపోవడంతో  బయట జాతీయరహదారిపై కూడా భారీగా జనం ఉండిపోయారు. ఇక సిద్ధం సభకు సంబంధించిన దృశ్యాలను వైసీపీ శ్రేణులు ట్విట్టర్ వేదికగా  పోస్టు చేసి.. టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.

సిద్ధం సభ అనంతరం సభకు వచ్చిన వాహనాలన్నీ ఒక్కసారిగా బయలుదేరాయి. దీంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఈ వీడియోను వైసీపీ అఫిషియల్ ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ లో షేర్ చేస్తూ.. ఇవి గ్రీన్ మ్యాట్ లు కాదు, గ్రాఫిక్స్ కాదు..పప్పు.. జగనన్న మీద అభిమానంతో వచ్చిన వైఎస్సార్ సీపీ సైన్యమని అందులో రాసుకొచ్చారు.  సిద్ధం సభ ట్రాఫిక్ జామ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తే మండే అగ్నిగోళంలా వెలుగుతుందని పలువురు రీ ట్విట్ చేశారు. గ్రీన్ మ్యాట్, గ్రాఫిక్స్ అంటూ  టీడీపీ నేతలు, చేస్తున్న అసత్య ప్రచారానికి సరైన సమాధానం ఈ వీడియోలు అంటూ పలువురు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbycasino girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio