Venkateswarlu
Venkateswarlu
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమెన్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ నిమిత్తం ఉన్నారు. జైలు అధికారులు చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691ను కేటాయించారు. ఎస్పీజీ భద్రత కలిగిన వ్యక్తి కావడంతో..మాములు ఖైదీలకు దూరంగా ఉంచారు. ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన గదిని కూడా కేటాయించారు. ఇక, ఆహారం కూడా చంద్రబాబు ఇంటి నుంచే వస్తోంది. టిఫిన్, లంచ్,డిన్నర్‌లు ఇంటినుంచి ప్రత్యేకంగా తెప్పిస్తున్నారు.
ఈ మధ్యహ్నం కూడా ఆయనకు ఇంటినుంచి స్పెషల్ అంచ్ వచ్చింది. కుటుంబసభ్యులు ఆయనకు మధ్యాహ్న భోజనంలో భాగంగా బ్రౌన్ రైస్, బెండకాయ పేపుడు, పన్నీరు కూర, పెరుగు పంపించారు. మూడు గంటలకు టీ తాగేందుకు వేడి నీళ్లను సైతం పంపారు. ఆయన జైలులో ఉన్నన్ని రోజులు ఇంటినుంచే ఆహారం రానుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు శనివారం అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో ఆయన్ని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
నంద్యాలనుంచి విజయవాడ తీసుకువచ్చారు. ఆదివారం కోర్టు ముందు హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ నిమిత్తం ఆయన్ని రాజమంత్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 14 రోజుల రిమాండ్ అనంతరం ఆయన్ని మళ్లీ కోర్టు ముందు హాజరుపర్చే అవకాశం ఉంది. ఈ సీమెన్స్ కేసు 2016-2018 కాలంలో జరిగింది. అప్పటినుంచి ఈ కేసుపై దర్యాప్తు జరుగుతూ వచ్చింది. ఏపీ సీఐడీ ఈ స్కాంలో చంద్రబాబును ఏ1 గా గుర్తించింది. అచ్చెన్నాయుడు ఏ2గా ఉన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఇంటి భోజనం
బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీరు కూర, పెరుగు
మధ్యాహ్నం మూడు గంటలకు టీ తాగేందుకు వేడి నీళ్లు పంపిన కుటుంబ సభ్యులు pic.twitter.com/lyBUM82R8X
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2023