iDreamPost
android-app
ios-app

APలో ఆ రోజు సెలవు.. ఉత్తర్వులు విడుదల చేసిన సీఎస్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచూ వివిధ రకాల సెలవుల గురించి కీలక ప్రకటనలు చేస్తుంది. తాజాగా కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి కీలక ఉత్తర్వూలు జారీ చేశారు. మరి సెలవును ప్రకటిస్తూ ఉత్తర్యూలు జారీ చేశారు. మరి... ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచూ వివిధ రకాల సెలవుల గురించి కీలక ప్రకటనలు చేస్తుంది. తాజాగా కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి కీలక ఉత్తర్వూలు జారీ చేశారు. మరి సెలవును ప్రకటిస్తూ ఉత్తర్యూలు జారీ చేశారు. మరి... ఆ వివరాలు..

APలో ఆ రోజు సెలవు.. ఉత్తర్వులు విడుదల చేసిన సీఎస్!

ఆంధ్రప్రదేశ్ లో సెలవులకు సంబంధించి తరచూ ఏదో ఒక ప్రకటన విడుదలవుతుంటుంది. ఇప్పటికే ఒంటిపూట బడులు, వేసవి కాలం సెలవులకు సంబందించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒంటి పూట బడులు ఏపీలో నడుస్తున్నాయి. ఇదే సమయంలో ఇతర ప్రత్యేక సెలవు రోజుల గురించి ఏపీ ప్రభుత్వం తరచూ కీలక ప్రకటనలు చేస్తుంది. తాజాగా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓ కీలక ప్రకటన చేశారు. ఏపీలో త్వరలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే త్వరలో ఏపీ అసెంబ్లీ లోక్ సభ  స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగ్గా..జూన్4వ తేదిన ఫలితాలు వెలువడనున్నాయి. ఇది ఇలా ఉంటే.. మే 13న సోమవారం సెలవు ప్రకటించారు. పోలింగ్ రోజు సెలవును ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వూల జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వూల మేరకు పోలింగ్ రోజున సెలవు ఉంటుందని ఆయన తెలిపారు. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు మే 13న వేతనంతో కూడిన సెలవును కార్మిక శాఖ ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, కంపెనీ యాక్ట్, సముదాయాల చట్టాల కింద సెలవు ప్రకటిస్తారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి  ఉత్తర్వులు జారీ చేసింది.

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లోక్ సభా, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ కెఎస్. జవహర్ రెడ్డి, డీజీపీ కేవి.రాజేంద్రనాధ్ రెడ్డి, సీఈవో ముకేశ్ కుమార్ మీనాలు పాల్గొన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఐటీ, శాంతి భద్రతలు, కమ్యునికేషన్ ప్లాన్, ఓటరు హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు వంటి తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో డీజీపీ, సీఈవోతో పాటు వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నామని సీఎస్ తెలిపారు. అదే విధంగ ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో విసృత్తంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇలానే ఎన్నికలకు సంబంధించిన పలు అంశాల గురించి సీఎస్ జవహర్ రెడ్డి ప్రస్తావించారు. మొత్తంగా మే 13వ తేదీన  సెలవును ప్రకటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వూలు జారీ చేశారు. దీంతో మే 13వ తేదీన హాలిడే కానుంది.