iDreamPost
android-app
ios-app

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో కుండపోత వర్షాలు

  • Published Sep 22, 2024 | 10:56 AM Updated Updated Sep 22, 2024 | 10:56 AM

Rain Alert For Telugu States:: కొన్ని రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అకాల వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే అంతా సర్దుమణుగుతున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Rain Alert For Telugu States:: కొన్ని రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అకాల వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే అంతా సర్దుమణుగుతున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 22, 2024 | 10:56 AMUpdated Sep 22, 2024 | 10:56 AM
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో కుండపోత వర్షాలు

కొన్ని రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు ప్రజలు అతలాకుతలం అయ్యారు. ఇప్పుడిప్పుడే అంతా సర్దుమణుగుతున్న సమయంలో మరోసారి వర్షాలు మొదలయ్యాయి. శనివారం రోజున పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ముఖ్య ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. దీనితో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో రెయిన్ అలెర్ట్ ను జారీ చేసింది. రానున్న మూడు, నాలుగు రోజుల పాటు.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో మొత్తం 29 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూల్ ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీమ్, మెదక్, మల్కాజ్ గిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి జిల్లాలలో.. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు.. హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం రోజున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. కాబట్టి రానున్న మూడు నాలుగు రోజులు కూడా ఇదే పరిస్థితి నెలకొననుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల విషయానికొస్తే… ఆదివారం రోజున మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాల కురిసే అవకాశం ఉంది. అలాగే కాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక నిన్న హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ముంచేసింది. దీనితో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లపై మోకాళ్ళ లోతు నీళ్లు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రానున్న నాలుగు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ముందుగానే పేర్కొన్నారు. కాబట్టి ప్రజలంతా అపప్రమత్తంగా ఉండడం మంచిది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.