Keerthi
ప్రస్తుతం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతల్లో వరుణుడు జోరు తగ్గింది. కానీ రేపు కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వర్షం తక్కువగా ఉన్నప్పుడు నగరవాసులు ఈ ముఖ్య పనులు చేసుకుంటే మంచింది. అదేమిటంటే..
ప్రస్తుతం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతల్లో వరుణుడు జోరు తగ్గింది. కానీ రేపు కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వర్షం తక్కువగా ఉన్నప్పుడు నగరవాసులు ఈ ముఖ్య పనులు చేసుకుంటే మంచింది. అదేమిటంటే..
Keerthi
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో మొత్తం కుండపోత వర్షాలతో దంచికొడుతుంది. కాగా, ఇప్పటికే వాగులు, నదులు, చెరువులు పొంగిపోవడంతో రహదారులన్ని జలమయమైయ్యాయి. పలు లోతట్టు ప్రాంతల్లో నీరు చేరిపోవడంతో రాష్ట్రంలోని ప్రజలు అతలాకుతలమైయ్యారు.
అయితే పలు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రంలోని రేపు సెప్టెంబర్ 2వ తేదీన పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతానికి రాష్ట్రంలో కొన్ని ప్రాంతల్లో వర్ష ప్రభావం తగ్గడంతో ఈ సమయంలోనే నగరవాసులు ఈ ముఖ్య పనులు చేసుకుంటే మంచింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వరుణుడు జోరు తగ్గింది. కనీసం మధ‍్యహ్నం వరకు అడుగు తీసి బయటకు వేయలంటే ప్రజలు భయంద్రోళనకు గురైయ్యారు. అంతలా రాష్ట్రవ్యాప్తంగా బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసింది. కానీ, ప్రస్తుతానికి కాస్త ఈ వర్ష ప్రభావం తగ్గింది. కానీ, రేపు కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని పలు ప్రాంతాల‍్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. కనుక కాస్త వర్షం తక్కువ ఉన్నప్పుడే ప్రజలు బయటకు వెళ్లి అత్యవసర పనులు అనగా.. పాలు, కూరగాయలు వంటి నిత్యవసర సరుకులను తెచ్చుకోవడం మేలు. లేకుండా.. రేపు కూడా భారీ వర్షం ఉంటే ప్రజలు అడుగు తీసి బయటకు పెట్టడం చాలా కష్టంగా ఉంటుదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రస్తుతం నిత్యవసర సరుకులు అవసరం ఉన్నవారు వెంటనే బయటకు వెళ్లి తెచ్చుకోవాడం ఉత్తమం.