తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వర్షాలు.. ఆ పది జిల్లాలకు రెడ్ అలర్ట్!

Heavy Rain Fall Alert: జూన్ నెల చివరి వారం నుంచి వర్షాలు పడటం మొదలయ్యాయి.. అటు ఉత్తరాధి, ఇటు దక్షిణాదిలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.

Heavy Rain Fall Alert: జూన్ నెల చివరి వారం నుంచి వర్షాలు పడటం మొదలయ్యాయి.. అటు ఉత్తరాధి, ఇటు దక్షిణాదిలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.

దేశంలో జులై మొదటి వారం నుంచి అసలైన వర్షాలు కాలపు వర్షాలు కురుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా నదులు, కాల్వలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఒకటీ రెండు రోజులు తప్ప తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఆవర్తనం, రుతుపవన ద్రోణి కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం దానికి సంబంధించిన ఆవర్తనం, రుతు పవన ద్రోణి ప్రభావం వల్ల రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్ర, శని వారాల్లో పది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో కరీంనగర్, జయశంకర్ భూపాల్ పల్లి, వరంగల్, పెద్దపల్లి, హనుమకొండ, కుమురంభీ-ఆసీఫ్ నగర్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. అలాగే జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, నిజామాబాద్, జయశంకర్ – భూపాల్ పల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో దాదాపు 20 సెంటీ మీటర్లకు పైగా వర్షం పడే ఛాన్స్ ఉందని అలర్ట్ చేశారు. గంటకు 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇండ్లల్లో ఉండాలని సూచించింది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయ్యింది. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. నేడు, రేపు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల సంతస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్ప పీడన ప్రభావం వల్ల నేడు ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచన ఉందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు. ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో అక్కడ్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Show comments