విజయవాడకు అమావాస్య గండం.. వణికిస్తున్న వర్షం!

Amavasya Sand for Vijayawada: ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణాంగా ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. విజయవాడలో రికార్డుస్థాయిలో వర్షాలు కురిశాయి.. దీంతో ప్రజా జీవనం అస్తవ్యస్థంగా తయారైంది. కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భందంలో చికుకున్నాయి.

విజయవాడకు అమావాస్య గండం వచ్చిపడిందని అంటున్నారు. అమావాస్య కారణంగా సముద్రం మంచి పోటు మీద ఉందని అంటున్నారు. సాధారణంగా వర్షం కారణంగా వరదలు వచ్చి చేరుతాయి.. ఆ వరద నీటిని సముద్రం తనలోకి తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. వరద జలాలు సముద్రంలో కలవకుంటే ముంపు భయం పెరిగిపోతుందని సమాచారం. ఎగువ నుంచి భారీ వరద నీరు.. దిగువ సముద్ర పోటుతో ఏం జరుగుతుందో అని విజయవాడ ప్రజలు గజ గజ వణికిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇండ్లల్లోకి వరదనీరు వచ్చి చేరిన విషయం తెలిసిందే. దీంతో ప్రజాలు నానా అవస్థలు పడుతున్నారు.. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ సిటీ ప్రజలకు రెండు రోజులుగా కంటిమీద కునుకులేకుండా పోయింది. సగానికి పైగా నగరం మొత్తం నీట మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉన్నట్లు తెలుస్తుంది. రాత్రి 12 గంటల తర్వాత అమావాస్య గడియలు ముగిసిన తర్వాత సాధారణ స్థితికి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అంచనా ప్రకారం.. ఒకవేళ వరద నీరు తగ్గకపోతే విజయవాడ పరిస్థితి ఆందోళనగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

Show comments