Gudlavalleru: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం..గర్ల్స్‌ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు!

Gudlavalleru Engineering College Hidden Cameras in Ladies Hostel Washrooms: ఇటీవల దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. టెక్నాలజీ వచ్చిన తర్వాత కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో సంచలన విషయం వెలుగు చూసింది.

Gudlavalleru Engineering College Hidden Cameras in Ladies Hostel Washrooms: ఇటీవల దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. టెక్నాలజీ వచ్చిన తర్వాత కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో సంచలన విషయం వెలుగు చూసింది.

ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ప్రతిరోజూ లైంగిక వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.  మొన్నటికి మొన్న కోల్‌కొతాలో ఓ ట్రైనీ డాక్టర్ పై అత్యారాచం, హత్య  ఘటన మరువక ముందే మహారాష్ట్ర రత్నగిరిలో ట్రైనీ నర్సుకు మత్త ఇచ్చి ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా.. కామాంధులు మాత్రం తమ పని చేసుకుంటూ పోతూనే ఉన్నారు.   తాజాగా తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే దారుణం ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

కృష్ణా జిల్లా గుడివాడలో దారుణ ఘటన వెలుగు చూసింది. గుడివాడ మండలం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ లో అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ లో రహస్య కెమెరాలు పెట్టి ఆ వీడియోలను కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తున్న దారుణం సంచలనంగా మారింది.అమ్మాయిల వీడియోలను కొంతమంది అబ్బాయిలు కావాల్సిన వారికి షేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థమవుతుంది. సుమారు 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్ కు చేరినట్లు సమాచారం అందుతుంది. గర్ల్స్‌ హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతి సహాయంతోనే బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఈ దారుణాలకు తెగబడినట్లు తెలుస్తుంది. ఈ విషయం బయట పడిన వెంటనే విద్యార్థినలు దర్నాకు దిగారు. ప్రస్తుతం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఆందోళన నెలకొంది.

ఇదిలా ఉంటే.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ జంట ఇటీవల ఓయో రూమ్ కి వెళ్లారు. అక్కడ అమ్మాయితో ఒంటరిగా ఉన్న వీడియో రికార్డు చేసి తన ఫ్రెండ్స్ కి షేర్ చేశాడు. ఆ తర్వాత యువకుడు, అతని ఫ్రెండ్స్ కలిసి యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ మాకు హాస్టల్ లో ఉన్న అమ్మాయిల ఫోటోలు లు కావాలి అని బెదిరించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ విద్యార్థిని అమ్మాయిల బాత్ రూమ్ లో రహస్య కెమెరా ఉంచి వీడియోలు తీసి బాయ్స్ కి పంపించినట్లు వార్తలు వస్తున్నాయి.

బాయ్ ఫ్రెండ్ కోసమేనా ఈ  దారుణం?

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇంత దారుణానికి పాల్పపడింది ఓ అమ్మాయి అని తెలియగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంత నీచానికి ఒడిగట్టిందని వార్తలు వస్తున్నాయి. అమ్మాయిలకు తెలియకుండా సీక్రెట్ గా బాత్ రూమ్‌లో హిడెన్ కెమెరాలు అమర్చి వీడియో తీసి బాయ్ ఫ్రెండ్ కి పంపించినట్లు తెలుస్తుంది. ఆ వీడియోలను కాలేజీలో విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు కాలేజ్ వర్గాలు, విద్యార్ధులు అనుమానిస్తున్నారు.  ఈ విషయాన్ని అమ్మాయిలు గుర్తించి వార్డెన్ కి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థినులు అర్థరాత్రి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఆందోళనకు దిగారు. ఆ వీడియోలు డిలీట్ చేయాలని, తమకు న్యాయం చేయాలంటూ కాలేజ్, హాస్టల్ యాజమాన్యంపై మండి పడ్డారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు కాలేజ్ వద్దకు వచ్చి పరిస్థితిని సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించారు.  ఎంత మంది అమ్మాయిల వీడియోలు తీశారు అన్న విషయం స్పష్టత లేదు.  తాజాగా తమకు జరిగిన అన్యాయంపై న్యాయ విచారణ చేయాలని విద్యార్థినులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డిమాండ్ చేశారు.

Show comments