Dharani
Gudlavalleru Hidden Camera Incident-Audio Clip Leak: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హిడెన్ కెమరాల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు...
Gudlavalleru Hidden Camera Incident-Audio Clip Leak: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హిడెన్ కెమరాల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు...
Dharani
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్ హాస్టల్ బాత్రుముల్లో సీక్రెట్ కెమరాలు పెట్టారని.. సుమారు 300 లకు పైగా వీడియోలు చిత్రీకరించారనే వార్త రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపిస్తుంది. పోలీసులు తమకు ఎలాంటి హిడెన్ కెమరాలు లభించలేదని తెలపగా.. విద్యార్థులు మాత్రం 28 కెమరాలు పెట్టారని చెబుతున్నారు. కెమెరాల ఘటనను కాలేజీ యాజమాన్యం కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న తమను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇక ఈ ఘటనపై స్పందించిన ప్రభత్వం.. ఐదురుగు మహిళలతో ఓ కమిటీని వేసి.. విచారిస్తామని తెలిపింది. ఇక ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతిని ఇప్పటికే హాస్టల్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా బయటకు పంపించి వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఆడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియోలో.. కాలేజీ హాస్టల్ కి చెందిన యువతి అసలే జరిగింది అనే వివరాలు తన స్నేహితురాలితో పంచుకుంది. రెండేళ్ల నుంచి ఈ ఘటన జరుగుతుందని.. కానీ వారం రోజుల క్రితం వెలుగులోకి వచ్చిందని విద్యార్థిని ఫోన్ కాల్లో చెప్పుకొచ్చింది. హాస్టల్ కాలేజీలో ఉండే బాయ్స్ స్టూడెంట్స్.. తమ స్నేహితురాళ్లతో దీని గురించి చెప్పారని.. మీ హాస్టల్లో ఏం జరుగుతుంది.. మీ ప్రైవేటు స్పేస్ లో కెమరాలు పెట్టిన సంగతి కూడా మీకు తెలియదా.. అంతలా నమ్ముతున్నారా అని ప్రశ్నించారని.. అలా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని సదరు విద్యార్థిని ఫోన్ కాల్ లో చెప్పుకొచ్చింది.
దీని గురించి యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే.. ఆధారాలున్నాయా.. అని ప్రశ్నించడమే కాక.. తమను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని.. చెప్పుకొచ్చింది. ఇక నిందిత విద్యార్థిని కొందరు అబ్బాయిలు చితకబాదారని దాంతో అతడు వాస్తవాలు వెల్లడించాడని ఆడియో క్లిప్ లో ఉంది. వీడియోలను హైదరాబాద్ లోని మల్లారెడ్డితో పాటు మరికొన్ని కాలేజీల విద్యార్థులకు అమ్మానని అంగీకరించాడని.. ఈ ఘటనలో కాలేజీ యాజమాన్యం.. గర్ల్ స్టూడెంట్ ని కాపాడే ప్రయత్నం చేస్తుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. కాలేజీకి సెలవులు ఇచ్చారు. సోమవారం వరకు హాలీడేస్ ఇచ్చి.. విద్యార్థులను ఇంటికి పంపించి వేశారు.