iDreamPost
android-app
ios-app

Gudlavalleru: గుడ్లవల్లేరు కాలేజీ ఘటన.. బాత్రూమ్ షవర్లలో కెమెరాలు?

  • Published Aug 31, 2024 | 12:58 PM Updated Updated Aug 31, 2024 | 12:58 PM

Gudlavalleru-Hidden Cameras In Bathroom Showers Alleges Girl Students: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన సంచలనంగా మారింది. కాలేజీ గర్ల్స్ హాస్టల్ లో రహస్య కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది.

Gudlavalleru-Hidden Cameras In Bathroom Showers Alleges Girl Students: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన సంచలనంగా మారింది. కాలేజీ గర్ల్స్ హాస్టల్ లో రహస్య కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది.

  • Published Aug 31, 2024 | 12:58 PMUpdated Aug 31, 2024 | 12:58 PM
Gudlavalleru: గుడ్లవల్లేరు కాలేజీ ఘటన.. బాత్రూమ్ షవర్లలో కెమెరాలు?

ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతుంది. కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దీనిపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా స్పందించలేదని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. గురువారం అర్ధరాత్రి సమయంలో కాలేజీలో ఆందోళన చేపట్టిన విద్యార్థినులు ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై దాడి చేశారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సాయంతో సీక్రెట్ కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డ్ చేసినట్లు చెబుతున్నారు. వాటిని కొన్ని ప్రైవేట్ వెబ్ సైట్స్ కి అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తున్నారని.. రెండు నెలలుగా ఇలా జరుగుతుందని అంటున్నారు.

నిందితుల దగ్గర 300 వీడియోలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అయితే తమ కాలేజీ హాస్టల్ లో ఎలాంటి సీక్రెట్ కెమెరాలు లేవని కాలేజీ యాజమాన్యం, హాస్టల్ వార్డెన్ చెబుతున్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో బాత్రూం షవర్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టాలని ప్రయత్నించారని అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. షవర్ లో హిడెన్ కెమెరా పెట్టాలని ప్రయత్నించారని.. షవర్ క్యాప్ లు తీసి కెమెరా పెట్టాలని చూశారని అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. వాష్ రూమ్స్ ముందు ఇలా ఉండేవి కాదని.. షవర్స్ లో కెమెరాలు పెట్టి వాటిని అమర్చే ప్రయత్నం చేసినట్టు అమ్మాయిలు చెబుతున్నారు. అయితే గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్ లో ఎలాంటి కెమెరాలు ఉన్నట్లు ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. కానీ బాత్రూం షవర్లలో కెమెరాలు పెట్టారని హాస్టల్ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు సీక్రెట్ కెమెరాలు అమర్చిందంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న విద్యార్థినిని కాలేజీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి తప్పించి వేరే చోట దాచి పెట్టినట్లు తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ అమ్మాయిని కాలేజీ యాజమాన్యం తమ కారులో రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ అమ్మాయి వెంట ఒక లేడీ కానిస్టేబుల్ ని కూడా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. కాగా ఆ అమ్మాయిలో ఎలాంటి భయం లేదని.. పైగా రివర్స్ లో తమను బెదిరిస్తుందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులు దాడి చేయబోతే మిడిల్ ఫింగర్ చూపించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏది ఏమైనా కానీ కాలేజీ యాజమాన్యం, పోలీసులు ఎలాంటి కెమెరాలను లేవని చెబుతున్నారు. అమ్మాయిలు మాత్రం కెమెరాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. మరి ఈ కేసుని పోలీసులు ఎంత త్వరగా సాల్వ్ చేస్తే అంత మంచిది. లేదంటే ఈ సమస్య మరింత పెద్దదవుతుందని అంటున్నారు. మరి బాత్రూం షవర్లలో కెమెరాలు ఉన్నాయని ఆరోపిస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.