iDreamPost
android-app
ios-app

Gudlavalleru: గుడ్లవల్లేరు కాలేజీ ఘటన.. నిందితురాలిని తప్పించిన కాలేజీ యాజమాన్యం

  • Published Aug 31, 2024 | 8:24 AM Updated Updated Aug 31, 2024 | 8:24 AM

Gudlavalleru Hidden Camera Incident Update: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ రహస్య కెమరాల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

Gudlavalleru Hidden Camera Incident Update: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ రహస్య కెమరాల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Aug 31, 2024 | 8:24 AMUpdated Aug 31, 2024 | 8:24 AM
Gudlavalleru: గుడ్లవల్లేరు కాలేజీ ఘటన.. నిందితురాలిని తప్పించిన కాలేజీ యాజమాన్యం

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, గుడివాడ సమీపంలోకి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స హస్టల్ వాష్రూమ్ లో హిడెన్ కెమరాల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రెండు నెలలుగా ఈ వ్యవహారం సాగుతుందని.. 300 వీడియోలు నిందితుల దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. ఈ వ్యవహారం గురించి కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే వారు సరిగా స్పందించకపోవడంతో.. విద్యార్థినులు ఆందోళనకు దిగారు. గురువారం అర్థరాత్రి కాలేజీ ప్రాంగణంలో ఆందోళన చేయడమే కాక.. నిందితుడిపై దాడి చేశారు. బీటెక్ ఫైనలియర్ కు చెందిన ఓ విద్యార్థిని సాయంతో నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. ఇక కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండటంతో.. యాజమాన్యం సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇంటికి పంపించింది. ఈక్రమంలో నిందిత విద్యార్థినికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

గుడ్లవల్లేరు కాలేజీ హిడెన్ కెమరాల ఘటన వెనక ఉన్నది అదే కాలేజీకి చెందిన ఓ యువతి కావడం సంచలనంగా మారింది. ఆమె బాయ్ ఫ్రెండ్, మరికొందరు విద్యార్థులు కలిసి నిందితురాలిని బెదిరించడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం సదరు విద్యార్థినిని గుట్టు చప్పుడు కాకుండా కాలేజీ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. పైగా ఇంతటి తప్పు చేసినప్పటికి.. సదరు విద్యార్థినిలో ఎలాంటి బెరుకు, భయం లేవని.. పైపెచ్చు.. రివర్స్ లో మిగతా స్టూడెంట్స్ ని బెదిరిస్తుందని విద్యార్థులు తెలిపారు. మిగతా  విద్యార్థినులు ఆమెపై దాడి చేయడానికి యత్నించగా సదరు యువతి మిడిల్ ఫింగర్ చూపించడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఆడియో క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. విద్యార్థినిలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అంతేకాక ఈ ఘటన మూడ్రోజుల క్రితమే తమ దృష్టికి వచ్చింది అంటూ స్టూడెంట్స్ వార్డెన్ తో చెప్పారు. అలాగే పోలీసులు, అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ విషయాలపై అధికారులు కూడా స్పందిస్తూ.. సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని వెల్లడించారు. ఐదుగురు మహిళా సిబ్బందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీని వల్ల విద్యార్థుల కెరీర్ కి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా ఉండేలా చూస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు.