APలోని పెన్షన్ దారులకు శుభవార్త! రేపటి నుంచి పింఛన్ పంపిణీ! ఎలా ఇస్తారంటే?

AP Pension Distribution: ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ నడుస్తుంది. ఈ క్రమంలో వాలంటీర్లు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదనిఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.

AP Pension Distribution: ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ నడుస్తుంది. ఈ క్రమంలో వాలంటీర్లు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదనిఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఒకటవ తేదీ రాగానే చాలా మంది పెన్షన్ కోసం ఎదురు చూపులు చూస్తుంటారు. మొన్నటి వరకు ఒకటవ తేదీన వాలంటీర్లు ఇటికి వచ్చి వృద్దులకు, దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేసేవారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరుకు వాలంటీర్లు పింఛన్లు, ప్రభుత్వ పథకాల పంపిణీలో భాగం కాకూడదని ఆంక్షలు విధించింది. అంతేకాదు వారి వద్ద ఉన్న ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూవా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో పేద ప్రజలకు పింఛన్లు ఎలా అన్న విషయంపై తర్జనభర్జన కొనసాగింది. ఈ క్రమంలో ఏపీ సర్కార్ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీలో త్వరలో ఎన్నికల జరగబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్డ అమల్లో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకువచ్చింది. వృద్దులకు, దివ్యాంగులకు ఫించన్లు ఒకటో తారీఖు వాలంటీర్లు వారి ఇండ్లకు వెళ్లి అందజేసేవారు. అయితే ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం.. వాలంటీర్లను ఎలాంటి ప్రభుత్వ కార్యాకలాపాల్లో పాల్గొనకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎం చంద్రబాబు కుట్ర నేపథ్యంలోనే ఇది జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై కలెక్టర్లతో సమావేశం అనంతరం పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏపీ సీఎస్ మార్గదర్శకాలపై చర్చలు జరిపింది.

ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పింఛన్ల పంపిణీపై విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్రమంలోనే దివ్యాంగులు, వృద్దులు, రోగులకు వారి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేయాలని..మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయాలని నిర్ణయంతీసుకుంది. రేపటి నుంచి ఈ నెల 6 వరకు పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.  ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరుకు పెన్షన్ పంపిణీ ఉంటుందని తెలిపింది. సిబ్బంది కొరత కారణంగా రెండు కేటగిరీలుగా పెన్షన్లు పంపిణీ చేపట్టారు. ఈ వార్త విన్న పెన్షన్ దారులు ఆనందాలు వెల్లువిరిశాయి.

Show comments