భక్తుడి భారీ విరాళం.. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో బంగారు ధ్వజ స్తంభం..?

Annavaram Satyanarayana Swamy: అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. స్వామివారి ఆలయంలో బంగారు ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టంచారు. ఓ భక్తులు స్వామి వారికి ఈ బంగారు ధ్వజ స్తంభం విరాళంగా ఇచ్చారు. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

Annavaram Satyanarayana Swamy: అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. స్వామివారి ఆలయంలో బంగారు ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టంచారు. ఓ భక్తులు స్వామి వారికి ఈ బంగారు ధ్వజ స్తంభం విరాళంగా ఇచ్చారు. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో అన్నవరంలో సత్యనారాయణ స్వామి వెలశారు. కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకు కొంగు బంగారంగా  స్వామి వారికి పేరుంది. ఇక్కడి నిత్యం ఎంతో మంది భక్తులు వచ్చి..స్వామి వారిని  దర్శించుకుని..తమ సామర్థ్యం మేరకు విరాళాలు అందిస్తుంటారు. అలానే తాజాగా ఓ భక్తుడు స్వామివారికి భారీ విరాళం ఇచ్చారు. స్వామి వారికి బంగారు ధ్వజ స్తంభాన్ని తయారు చేయించారు. మరి..  ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సోమవారం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభాన్ని  ప్రతిష్టించారు. ధ్వజస్తంభం ప్రతిష్టాపన వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలానే ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఛైర్మన్ రోహిత్, ఈవో రామచంద్రమోహన్‌తో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. నెల్లూరు జిల్లాకు చెందిన  ఓ భక్తుడు స్వామివారికి బంగారు ధ్వజస్తంభాన్ని తయారు చేయించారు. సుమారు ఒకటిన్నర కేజీ బంగారంతో ఈ ధ్వజస్తంభం తయారు చేయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇక అన్నవరం వచ్చి మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు బలంగా నమ్ముతారు. అందుకే  ఇక్కడి నిత్యం పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వధూవరులు అన్నవరం సత్యనారాయణ వ్రతం కోసం వస్తుంటారు. అలానే ఈ పుణ్యక్షేత్రంలో ప్రతిరోజూ సుప్రభాత సేవ  వంటి పలు కార్యక్రమాలు, ఉత్సవాలను ఆలయ పూజారులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తిరుమల తరహాలో ఇక్క రోజూ నిత్యకళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది భక్తులు  తమ సామార్థ్యం మేరకు విరాళాలు అందిస్తుంటారు.

అలానే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ భక్తులు పెద్ద మనస్సుతో బంగారు ధ్వజ స్తంభం చేయించారు. ఆ దాత సహకారంతో రెండు కోట్లు ఖర్చుపెట్టి సుమారు ఒకటిన్నర కేజీ బంగారుతో ఈ ధ్వజ స్తంభ తయారుచేశారు. ఇక ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ఆలయంలోని అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఇదే సమయంలో జాతీయ రహదారిపై కొత్తగా నిర్మించిన ఆలయంలో స్వామి, అమ్మవారు, పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్ఠించారు. ఈ వేడుకను  వైభవంగా నిర్వహించారు.

Show comments