iDreamPost
android-app
ios-app

పెళ్లింట విషాదం.. కాలి బూడిదైన నగలు, నగదు!

  • Published Feb 20, 2024 | 3:11 PM Updated Updated Feb 20, 2024 | 3:11 PM

Wedding Tragedy: పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.. అగ్ని ప్రమాదం ఆ ఇంట్లో తీరని ఆవేదన మిగిల్చింది.

Wedding Tragedy: పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.. అగ్ని ప్రమాదం ఆ ఇంట్లో తీరని ఆవేదన మిగిల్చింది.

పెళ్లింట విషాదం.. కాలి బూడిదైన నగలు, నగదు!

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. మానవ తప్పిదాలు, షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. సాధారణంగా కెమికల్, బాణా సంచా ఫ్యాక్టరీలు, ప్లాస్టీక్ గోదాములు,  షాపింగ్ మాల్స్, వస్త్ర సముదాయాలు ఉన్న చోట ఫైర్ సేఫ్టీ తప్పకుండా ఉంచాలని నిబంధనలు ఉన్నాయి. కొంతమంది వీటిపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలు జరిగినపుడు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు అపార్ట్ మెంట్స్ ఇతర ప్రదేశాలు, ఫంక్షన్ హాల్స్ లో షాట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో అగ్ని ప్రమాదం తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో వల్ల అగ్ని ప్రమాదం సంభవించి నగదు, బంగారం, వెండి, కొత్త బట్టలు కాలి బూడిదయ్యాయి. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లా కరివేముల గ్రామానికి చెందిన మోహన్ రావు, నరసారావు ల ఇంట్లో వారి చెల్లెలు వివాహం నిశ్చయం అయింది. ఈ క్రమంలోనే పెళ్లి ఏర్పాటు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. పెళ్లి కోసం కొంత కాలంగా పొదుపు చేసిన సొమ్ము, అప్పు చేసి దాదాపు రూ.15 లక్షల డబ్బులు, పది తులాల బంగారం, వెండి నగలు, పట్టు చీరలు, కొత్త దుస్తులు ఇంట్లో తెచ్చి బీరువాలో దాచి ఉంచారు.

బీరువాలో ఉన్న గదిలో హఠాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.. కానీ అప్పటికే పెద్ద ఎత్తున ఎగసిపడటంతో భయంతో బయటకు పరుగులు తీశారు. వారి కళ్ల ముందే పెళ్లి కోసం దాచిన సామాగ్రి, డబ్బు మొత్తం కాలి బూడిదయ్యాయి. మరో వారం రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట అగ్ని మంటలు బీభత్సం సృష్టించాయి. ఆ దారుణం చూడలేక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. చెల్లి పెళ్లి కోసం తెచ్చిన నగదు, బంగారు, వెండి ఆభరణాలు, కొత్త బట్టలు తమ ముందే కాలిపోవడం తల్చుకుంటే కన్నీళ్లు ఆగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.