iDreamPost
android-app
ios-app

సెల్ఫీ విషయంలో వివాదం.. జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!

  • Published Nov 27, 2023 | 12:20 PM Updated Updated Nov 27, 2023 | 12:20 PM

కొన్నిసార్లు సెల్పీలు ఎన్ని ప్రమాదాలు తీసుకు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సెల్ఫీల కసం ప్రాణాలు పోగొట్టున్న సంఘనలు ఎన్నో వెలుగు చూశాయి.

కొన్నిసార్లు సెల్పీలు ఎన్ని ప్రమాదాలు తీసుకు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సెల్ఫీల కసం ప్రాణాలు పోగొట్టున్న సంఘనలు ఎన్నో వెలుగు చూశాయి.

  • Published Nov 27, 2023 | 12:20 PMUpdated Nov 27, 2023 | 12:20 PM
సెల్ఫీ విషయంలో వివాదం.. జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది మానవాళి మనుగడకు ప్రమాదం పొంచి ఉందని కొంతమంది వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు. కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. ఒక్క స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే అంటున్నారు. ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ తో రక రకాల వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం అప్ లోడ్ చేస్తున్నారు. కొన్ని వీడియోలు బాగా క్లిక్ అయి రాత్రికి రాత్రే స్టార్లు అయిన వాళ్లు ఉన్నారు. ఇటీవల సెల్ఫీ మోజులో పడి కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. సెల్ఫీ కోసం పోటీపడి కొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా సెల్ఫీ కారణంగా చెలరేగిన వివాదం కొంతమంది మహిళలు జుట్లు పట్టుకొని  కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

గుంటూరులో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక చిన్న సెల్ఫీ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి మహిళలు రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. అక్కడితో ఆగకుండా గ్రూపుల్లో కొంతమంది మహిళలు జట్లు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అసలు విషయానికి వస్తే.. గుంటూరులోని గాంధీ పార్కులో కొంతమంది మహిళలు ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. పార్కులోని సెల్ఫీల కోసం యువతులు ఒక్కసారిగా ఎగబడటంతో గొడవలు మొదలయ్యాయి. ముందు తాము సెల్ఫీ దిగాలని అంటే.. లేదు మేం ముందు వచ్చాం.. మేం సెల్ఫీ తీసుకునే సమయంలో అడ్డు పడటం పద్దతి కాదని చెప్పడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే రెండు గ్రూపులుగా విడిపోయిన మహిళలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించకున్నారు.

గొడవలు శృతి మించి జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి చేరుకుంది. అక్కడ ఉన్న కొంతమంది వీళ్ళ గొడవ చూసి షాక్ తిన్నారు.. మరికొంతమంది తమ సెల్ ఫోన్లో ఆ దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం సెల్పీ మోజుతో ఇలా గొడవలు పెట్టుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పార్కులో ఎన్నో ప్రదేశాలు ఉంటాయి..సామరస్యంగా మాట్లాడుకొని ఉంటే ఇలాంటి గొడవలు జరిగి ఉండేవి కావని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.