iDreamPost
android-app
ios-app

పెళ్లి మండపంలో ప్రియుడిపై యాసిడ్‌ పోసి.. కత్తితో దాడి చేసిన ప్రేయసి!

  • Published Aug 12, 2024 | 12:30 AM Updated Updated Aug 12, 2024 | 7:39 AM

Annamaiya District : ఇటీవల పెళ్లి మండపాల్లో జరిగే చిత్ర విచిత్ర సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు ప్రియురాలు చేసిన హంగామా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Annamaiya District : ఇటీవల పెళ్లి మండపాల్లో జరిగే చిత్ర విచిత్ర సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు ప్రియురాలు చేసిన హంగామా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పెళ్లి మండపంలో ప్రియుడిపై యాసిడ్‌ పోసి.. కత్తితో దాడి చేసిన ప్రేయసి!

ఈ మధ్య కొంతమంది ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, అసహనం, తీవ్ర మనస్థాపాని గురికావడం జరుగుతుంది. పరిస్థితుల ప్రభావం, పని ఒత్తిడి, ఆర్థిక ,అనారోగ్య సమస్యలు, అక్రమ సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల తీవ్ర మనస్థాపానికి గురై క్షణికావేశంలో ఎదుటి వారిపై దాడులు చేయడం, కొన్నిసార్లు హత్యలకు పాల్పపడుతున్న ఘటనలు తరుచూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల పెళ్లి మండపాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని కామెడీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కి గురి చేసేలా ఉంటున్నాయి.  పెళ్లి పిల్ల, పెళ్లి కొడుకు పీటలపై కూర్చుని ఉండగా హఠాత్తుగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది.ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం, అరవపల్లిలో ఓ షాకింగ్ ఘటన వెలుగు లోకి వచ్చింది. కొద్ది నిమిషాల్లో పెళ్లి అయిపోతుందని అనుకునే లోపు పెళ్లి వేదికకు ప్రియురాలు వచ్చి నానా హంగామా చేసింది.దీంతో పెళ్లి ఆగిపోయింది. నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడురుకు చెందిన సయ్యాద్ భాషాతో జరగాల్సిన పెళ్లి అర్థాంతరంగా ఇగిపోయింది. సయ్యద్ పాషాతో తిరుపతికి చెందిన వివాహిత జయతో అక్రమ సంబంధం ఉంది.ఈ క్రమయంలోనే తన ప్రియుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకపోయిన జయ పెళ్లి మండపానికి చేరుకుంది. అందరూ చూస్తుండగా భాషాని నానా దుర్భాషలాడింది.

అంతేకాదు షాదీఖానాలో పెళ్లి కొడుకు సయ్యద్ భాషాపై కత్తి, యాసిడ్ తో దాడి చేసింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం, తోపులాట జరిగింది.ఈ ఘటన చూసి పెళ్లికి వచ్చిన బంధువులు హడలిపోయారు. ఈ తోపులాటలో అక్కడ ఉన్న కొంతమంది మహిళలపై యాసిడ్ పడింది. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయంపో కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలాని చేరుకున్న పోలీసులు పెళ్లి కొడుకు సయ్యద్ భాష, అతని ప్రియురాలు జయను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి అగిపోవడంతో బంధువులు ఉసూరు అనుకుంటూ వెనుదిరిగారు.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş