iDreamPost
android-app
ios-app

ఓయ్ రీ-రిలీజ్‌లో అమ్మాయి మాస్ డ్యాన్స్! అచ్చం హీరోయిన్‌లా!

  • Published Feb 14, 2024 | 2:57 PM Updated Updated Feb 14, 2024 | 2:57 PM

మూవీ లవర్స్ అంటే అబ్బాయిలే ఉంటారు అనుకోవడం పొరపాటు.. అమ్మాయిలు కూడా ఉంటారు. ఇదిగో అందుకు ఉదాహరణే ఈ అమ్మాయి. రీ రిలీజ్ మూవీస్ రావడం ఆలస్యం.. థియేటర్లలో వాలిపోవడమే కాదూ..

మూవీ లవర్స్ అంటే అబ్బాయిలే ఉంటారు అనుకోవడం పొరపాటు.. అమ్మాయిలు కూడా ఉంటారు. ఇదిగో అందుకు ఉదాహరణే ఈ అమ్మాయి. రీ రిలీజ్ మూవీస్ రావడం ఆలస్యం.. థియేటర్లలో వాలిపోవడమే కాదూ..

  • Published Feb 14, 2024 | 2:57 PMUpdated Feb 14, 2024 | 2:57 PM
ఓయ్ రీ-రిలీజ్‌లో అమ్మాయి మాస్ డ్యాన్స్! అచ్చం హీరోయిన్‌లా!

ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో హిట్ అయిన లేదా మంచి ఫీల్ గుడ్ మూవీస్‌ను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు ఆ చిత్ర మేకర్స్. ఈ వాలంటైన్స్ డే పురస్కరించుకుని పలు సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ప్రేమికుల రోజు నాడు లవర్స్ ఎక్కువ మూవీస్ చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోటా పోటీగా సినిమాలు రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. ఫీల్ గుడ్ ప్రేమ కథలను.. వాలంటైన్స్ డే సందర్భంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అలాంటి మూవీల్లో ఒకటి ఓయ్. 2009లో విడుదలైన ఈ మూవీ ట్రాజెడీ లవ్ స్టోరీ కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

బేబి షామిలీగా అలరించిన పాప.. హీరోయిన్‌గా ఈ మూవీతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. సిద్దార్థ్ కథానాయకుడు. ఇందులో హీరోయిన్ మరణించడాన్ని తెలుగు ఆడియన్స్ తీసుకోలేకపోయారు. కానీ ఈ థియేటర్లలో కన్నా టీవీల్లో మంచి వ్యూస్ రాబట్టుకుంది. ఓయ్ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. ఇందులో యువన్ శంకర్ రాజా అందించిన పాటలు సూపర్ డూపర్ హిట్.  చాలా మందికి ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ ఆల్ టైం ఫేవరేట్.  కాగా, వాలంటీన్స్ డే సందర్భంగా ఈ మూవీని కూడా రీ రిలీజ్ చేశారు మేకర్స్.  పలు థియేటర్లలో ఓయ్ మూవీ సందడి చేస్తోంది. ఈ సినిమా లవర్స్ థియేటర్లలో వాలిపోయారు.  వైజాగ్‌లోని సంగం శరత్ థియేటర్లలో కూడా విడుదలయ్యింది. ఈ మూవీ వాచ్ చేసేందుకు వచ్చిన ఓ అమ్మాయి.. తన డ్యాన్సులతో అదరగొట్టేసింది.

అందులోనూ శారీతో వచ్చి మరీ రచ్చ రచ్చ చేసింది.  ఓయ్ చిత్రంలోని ప్రతి సాంగ్‌‌కు ఊర మాస్ స్టెప్పులతో హంగామా సృష్టించింది. థియేటర్‌లో ఈ సినిమా చూసేందుకు వెళ్లిన అబ్బాయిల చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది ఈ అమ్మాయి. హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా.. పాటకు తగ్గట్లు కాలు కదిపింది. ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తుండగా.. చాలా మంది వీడియోలు తీసుకుని.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. కాగా.. ఆమె ఓయ్ మూవీకే కాదూ..ఇటీవల రి రిలీజైన వెంకీ సమయంలో కూడా థియేటర్లలో ఇదే రకమైన రచ్చ చేసింది. చూడబోతే.. అమ్మడు మూవీ లవర్ లా కనిపిస్తోంది. అప్పట్లో థియేటర్లలో మిస్ అయిన ఫీల్ గుడ్ చిత్రాలు.. ఇప్పుడు మళ్లీ విడుదల కావడంతో..హాలులో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తుందీ అమ్మాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss