రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తరచూ రామోజీ రావుపై, ఆయన సంస్థలపై అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. రామోజీరావు నడిపే మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టులో సైతం వ్యాఖ్యనించారు. ప్రస్తుతం మార్గదర్శి పై ఏపీ సీఐడీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఉండవల్లి అరుణ కుమార్ రామోజీరావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ అక్రమ నిర్మాణేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఫిల్మ్ సిటీ కోసం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను ఉల్లంఘించి భూములు సేకరించారని విమర్శించారు. ఈ ఫిల్మ్ సిటీ 2 వేల ఎకరాల భూముల విలువ ఇప్పుడు రూ.2 లక్షల కోట్లని ఉండవల్లి తెలిపారు.
బుధవారం రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామోజీరావు గురించి, ఆయన సంస్థల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఎందరో జమీందార్లు, పెద్దలు భూములు కోల్పోయారని, కానీ రామోజీ రావు మాత్రం అందుకు భిన్నమన్నారు. ఇందుకు మార్గదర్శి కేసులో జరుగుతున్న విచారణే నిదర్శనమని తెలిపారు. రామోజీకి కోర్టుల్లో చాలా పలుకుపడి ఉందని, ఆయన తలచుకుంటే ఎవరినైన జైల్లో పెట్టగల సమర్ధుడని ఉండవల్లి ఆరోపించారు.
ఇక మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రామోజీ రావు, ఎండీ శైలజా కిరణ్ లను అధికారులు ప్రశ్నించిన వీడియోలను బయటపెట్టాలని ఉండవల్లి కోరారు. మార్గదర్శి నిబంధనల ఉల్లంఘన ఏపీవలో జరిగితే తెలంగాణ కోర్టులో విచారించాలని పట్టుబట్టడం విచిత్రంగా ఉందని ఉండవల్లి అన్నారు. దీన్ని బట్టి ఏపీ ప్రభుత్వం కన్నా కూడా రామోజీరావుకు పలుకుబడి ఎక్కువగా ఉందని అర్ధమవుతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వాళ్లు ఇదే కేసులో జైలు వెళ్లారు కానీ, రామోజీ రావు మాత్రం వెళ్లలేదని తెలిపారు. ఆ విషయంపై చంద్రబాబుతో సహా ఏ ఒక్కరు మాట్లాడలేదన్నారు.
తన రాజగురువుకు కోపం వస్తే పునాదులు కదులుతాయని ఆయన భయపడుతున్నారని ఉండవల్లి వ్యాఖ్యనించారు. మార్గదర్శి వ్యవహారంలో రామోజీ రావు తప్పు చేయలేదని బాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజలు కట్టిన సొమ్ముకు, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వద్ద ఉన్న సొమ్ముకు తేడా ఉందని తెలిపారు. మార్గదర్శి అక్రమాలపై జరుగుతున్న విచారణ చూస్తుంటే…చట్టం ముందు అందరూ సమానం కాదనే భావన కలుగుతుందని, న్యాయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. మరి.. రామోజీ ఫిల్మ్ సిటీపై ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చంద్రబాబు.. పుంగనూరు నుంచి అల్లర్లకు పాన్ల్ చేశారు: సజ్జల