iDreamPost
android-app
ios-app

రైల్లో బిర్యాని తిన్న ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత.. రాజమండ్రి GGHకు తరలింపు!

  • Published Dec 25, 2023 | 12:54 PM Updated Updated Dec 25, 2023 | 12:54 PM

దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్వే ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసేవారు రైల్వే ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని భావిస్తుంటారు.

దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్వే ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసేవారు రైల్వే ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని భావిస్తుంటారు.

  • Published Dec 25, 2023 | 12:54 PMUpdated Dec 25, 2023 | 12:54 PM
రైల్లో బిర్యాని తిన్న ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత.. రాజమండ్రి GGHకు తరలింపు!

దేశంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. రైల్లో అన్ని వసతులు ఉంటాయి. ఇక ట్రైన్ లో ఎన్నో రకాల తినుబండారలు అమ్ముతుంటారు. టీ, కాఫీలు, టిఫిన్, బిర్యానీ, సమోసా, పఫ్స్ ఇలా ఎన్నో రకాల ఐటమ్స్ అమ్ముతుంటారు. నిత్యం ఒకరి తర్వాత మరొకరు తిరుగుతూనే ఉంటారు. వాటిలో కొన్ని క్వాలిటీ ఉండవని తెలిసి కూడా పిల్ల ఒత్తిడితో కొని తింటుంటారు. కొంతమంది ట్రైన్ రైల్వే స్టేషన్ లో ఆగినపుడు అక్కడ షాపుల్లో ఫుడ్ ఐటమ్స్ కొని తింటుంటారు. అలాంటి ఫుడ్ ఐటమ్స్ మంచివి కావని ఎన్నో సార్లు రుజువైంది.. తాజాగా రైలు ప్రయాణికులు బిర్యానీ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..

విశాఖ రైల్వే స్టేషన్ తో పాటు మరో రైల్ లో కొనుగోలు చేసిన బిర్యానీ తిని దాదాపు పది మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బంది వారిని రాజమహేంద్రవరం జీజీహెచ్ కు తరలించి చికిత్స అందించారు. దీంతో అస్వస్థతకు గురైన వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. పట్నా-ఎర్రాకుళం ఎక్స్ ప్రెస్ రైలు పట్నా నుంచి తమిళనాడు సేలకుం బయలుదేరింది. ఈ క్రమంలో ఐదుగురు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో బిర్యానీ కొనుగోలు చేసి తిన్నట్టు తెలుస్తుంది. బిర్యానీ తిన్న అర్ధగంటకు అందులో ఐదుగురికి వాంతులు, విరేచనాలు మొదలు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురై పరిస్థితి విషమంగా మారడంతో రైలు మదత్ యాప్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు, పోలీస్ సిబ్బంది 108 ద్వారా రాజమండ్రి జీజీహెచ్ కి తరలించారు.

Passengers who ate biryani in the train became seriously ill

ఇదిలా ఉంటే.. దిబ్రుగఢ్- కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ కేరళాలోని పాలక్కడ్ కు వెళ్తున్న ఏడుగురు ప్రయాణికులు విశాఖ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఎగ్ బిర్యానీ కొనుగోలు చేసి ఆరగించినట్లు తెలుస్తుంది. వారిలో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే రాజమండ్రి రైల్వే స్టేషన్ లో దించి ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా రైల్లో బిర్యానీ తినడం వల్ల తొమ్మిది మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ రెండు ఘటనలపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రయాణాలు చేసేవారు తప్పని సరి పరిస్థితిలో బయట ఫుడ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. కానీ నాణ్యమైన ఆహారం లభించక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు అధికారులు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారే తప్ప తరుచూ తనిఖీలు చేయడం లేదని వాపోతున్నారు. అపరిశుభ్రమైన ఆహారంతో ప్రాణాలతో చెలగాటమాడే దుఖానదారులపై రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.