iDreamPost
android-app
ios-app

వీడియో: మంతెన సత్యనారాయణ ఆశ్రమంలోకి వరద నీరు!

Manthena Satyanarayana Ashram: ఆంధ్రప్రదేశ్ లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాలు నీట మునిగాయి. అలానే ప్రముఖ ఆరోగ్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమయంలోకి వరద నీరు చేరింది.

Manthena Satyanarayana Ashram: ఆంధ్రప్రదేశ్ లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాలు నీట మునిగాయి. అలానే ప్రముఖ ఆరోగ్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమయంలోకి వరద నీరు చేరింది.

వీడియో: మంతెన సత్యనారాయణ ఆశ్రమంలోకి వరద నీరు!

గత రెండు రోజులు గా వానలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. ముఖ్యంగా శని, ఆదివారంలో కురిసిన వానకు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయవాడ నగరం అయితే సముద్రాన్ని తలపించింది. విజయవాడ పట్టణంలోని పలు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. పడవల సాయంతో బయటకు వస్తున్నారు. ఇంకా వర్షాలు తగ్గు ముఖం పట్టలేదు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆరోగ్య, ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరద నీటి ప్రభావానికి గురైంది. విజయవాడలోని కరకట్ట రోడ్డుకు పక్కనే ఉండే మంతెన ఆశ్రమంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

ఆదివారం కురిసిన భారీ వానకు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరద నీటిలో మునిగిపోయింది. విజయవాడ కరకట్టకు పక్కనే ఆయన ఆశ్రమం ఉంది. గత రెండు రోజులుగా కురిసిన వానలకు విజయవాడ ప్రాంతంలో కృష్ణానది ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. ఈక్రమంలోనే విజయవాడ కరకట్ట ప్రాంతంలో ఉన్న ఇళ్లు వరద ప్రవాహానికి గురవుతున్నాయి. అలానే కరకట్ట రోడ్డుకు పక్కనే ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆశ్రమలోని సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. తాళ్ల సాయంతో నీటి ప్రాంతం నుంచి సురక్షిత ప్రదేశానికి చేరుకుంటున్నారు. నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరకట్ట ప్రాంతంలో ఉంటే నివాస ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మంతెన ఆశ్రమంలో వరద నీరు చేరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మంతెన సత్యనారాయణ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రకృతి వైద్యులుగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అనేక రకాల ఆరోగ్య సమస్యలకు ప్రకృతి ద్వారా అందించే చికిత్సల గురించి ఆయన తెలియజేస్తుంటారు. అంతేకాక ఆరోగ్యానికి సంబంధించి అనేక విషయాలను తెలియజేస్తుంటారు. ఆయన చెప్పే ఆరోగ్య చిట్కాలను తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూస్తుంటారు. పలు టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొన్ని  ఆరోగ్య చిట్కాలు చెబుతు ఆయన గుర్తింపు పొందారు. ఆయనకు సంబంధించిన ఆశ్రమం.. విజయవాడ ప్రాంతంలోని కరకట్ట రోడ్డులో ఉంది. ఇక వరద విషయానికి వస్తే.. ఇప్పటికి కూడా కరకట్ట ప్రాంతంలో వరద ఉద్ధృతి తగ్గలేదు.