Fire Accident In Visakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం... కాలి బూడిదైన బోగిలు!

విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం… కాలి బూడిదైన బోగిలు!

Fire Accident In Visakhapatnam: ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారం జార్ఖాండ్ రాష్ట్రంలో ఓ రైలు ప్రమాదం జరిగింది. ఆ ఘటన మరువక ముందే..తాజాగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Fire Accident In Visakhapatnam: ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారం జార్ఖాండ్ రాష్ట్రంలో ఓ రైలు ప్రమాదం జరిగింది. ఆ ఘటన మరువక ముందే..తాజాగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు చోటుచేసుకంటున్నాయి. సాంకేతిక సమస్య, అగ్నిప్రమాదాలు వంటి కారణాలతో రైళ్లలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితమే జార్ఖండ్ ప్రాంతంలో ఓ రైలు ప్రమాదం  చోటుచేసుకుంది. తాజాగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆదివారం ఉదయం  విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కోర్బా – విశాఖ ఎక్స్‌ప్రెస్ లో అగ్నిప్రమాదంలో చోటుచేసుకుంది.   విశాక రైల్వే స్టేషన్ లో నాలుగో నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఆగి ఉన్న ఆ ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో  చాలా బోగీలు పూర్తిగా తగలబడిపోయాయి. బి6, బి7, ఏ1 బోగీలు అయితే  కాలిబూడిదయ్యాయి. ఇక ఈ అగ్నిప్రమాదం కారణంగా  రైల్వే స్టేషన్ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారి వచ్చిన మంటలతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను అధికారులు బయటకు పంపించారు.

ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. రైల్వే అధికారుల సహకారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఎక్స్ ప్రైస్ రైలు ఫ్లాట్‌ఫామ్‌పై  నిలిచి ఉన్న సమయంలోనే ప్రమాదం సంభవించింది. కోర్బా నుంచి విశాఖ రైల్వే స్టేషన్‌‌కు ఉదయం చేరుకున్న రైలు.. నాలుగో నెంబరు ఫ్లాట్‌ఫామ్‌పై ఉండగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూర్తిగా కాలిపోయిన బోగిలు అన్నీ ఏసీవే. ఇక ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు  ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం కోర్బా నుంచి ఈ రైలు విశాఖకు వచ్చింది. మరికాసేపట్లో విశాఖ నుంచి ఇదే ట్రైన్ తిరుమలకు బయల్దేరాల్సి ఉంది. కాలిపోయిన బోగీలను ట్రాక్ నుంచి వేరు చేస్తున్నారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సాంకేతిక కారణాలా? మరేదైనా జరిగిందా? అన్న కోణంలో అధికారులు దర్యాపర్తు చేస్తున్నారు. ఒక్కసారిగా విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంతంలో మంటలు చెలరేగి పొగలు కమ్ముకోవడంతో ప్యాసింజర్లు భయంతో పరుగులు తీశారు.

Show comments