iDreamPost
android-app
ios-app

వీడియో: విశాఖలోని డైనో పార్క్‌ లో భారీ అగ్ని ప్రమాదం!

  • Published Aug 13, 2024 | 5:36 PM Updated Updated Aug 13, 2024 | 5:36 PM

Fire Accident in Vizag: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వర్షాలు దంచి కొడుతున్నాయి.ఇలాంటి సమయంలో విశాఖలో భారీ అగ్ని ప్రమాదం భయాందోళన కలిగించింది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

Fire Accident in Vizag: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వర్షాలు దంచి కొడుతున్నాయి.ఇలాంటి సమయంలో విశాఖలో భారీ అగ్ని ప్రమాదం భయాందోళన కలిగించింది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

వీడియో: విశాఖలోని డైనో పార్క్‌ లో భారీ అగ్ని ప్రమాదం!

సాధారణంగా వేసవి కాలంలో ఎండలు మండిపోతుంటాయి.. అధిక ఉష్ణోగ్రతల వల్ల పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా కాటన్ పరిశ్రమలు, బానా సంచా, కెమికల్ ఫ్యాక్టరీల్లో తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అగ్ని ప్రమాదాలు మానవ తప్పిదాలు, కరెంట్ షార్ట్ సర్య్యూట్స్, గ్యాస్ సిలిండర్లు అనుకోకుండా పేలడం వల్ల జరుగుతుంటాయి. అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. తాజాగా విశాఖ పట్టణంలో రెస్టారెంట్ కమ్ రీ క్రియేషన్ డైనో పార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ విశాఖ పట్టణంలో ఓ రెస్టారెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాండురంగ పురం మత్స్య దర్శిని, ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న రీక్రియేషన్ డైనో పార్క్‌లో హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి.దీంతో అక్కడ భారీగా పొగలు వెలువడటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మొత్తానికి మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సిబ్బంది చుట్టు పక్కల వాళ్లను అప్రమత్తం చేశారు. డైనో పార్క్ లో మంటలు ఎగిసి పడటంతో జనాలు భయంతో పరుగులు తీశారు.

ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు అందలేదని తెలిపారు. ప్రస్తుతం ఆస్తి నష్టం పై అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఎక్కువ రద్దీగా ఉండే  డైనో పార్క్‌లో ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగించిందని స్థానికులు అంటున్నారు. మంటలు చూడగానే జనాలు అప్రమత్తం కావడంతో అక్కడ నుంచి తప్పించుకున్నారని స్థానికులు అంటున్నారు.