P Krishna
గత నెల విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కేవలం మనుషులు చేసిన తప్పిదాల వల్ల కోట్ల నష్టం వాటిల్లింది.
గత నెల విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కేవలం మనుషులు చేసిన తప్పిదాల వల్ల కోట్ల నష్టం వాటిల్లింది.
P Krishna
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తుల నిర్లక్ష్యం కోట్లలో నష్టం వాటిల్లింది. ఎంతోమంది మంది మత్స్యకారులు కన్నీళ్లపాలు చేసింది. గత నెల 19వ తేదీ రాత్రి 10.48 నిమిషాలకు ఇద్దరు వ్యక్తులు స్థానికంగా ఉండే ఇద్దరు మత్స్యకారులు బోటులో మందులోకి ఉప్పు చేప కాల్చుకొని తినగా.. అందులో నాని అనే యువకుడు బోటు పైకి ఎక్కి సిగరెట్ కాల్చుకొని విసిరివేయగా.. అది కాస్త వలలో పడి మంటలు చెలరేగి పెను ప్రమాదానికి కారణం అయ్యిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో వాసుపల్లి నాని, అతడి మామ సత్యం లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరోసారి అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
గత నెలలో జరిగిన విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ప్రమాదం నుంచి ఇంకా కోలుకోకముందే.. జాలరిపేటలోని ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి వేళ గాంధీ విగ్రహం వద్ద ఉన్న పలు బడ్డీలకు మంటలు వ్యాపించడంతో దగ్ధం అయ్యాయి. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఇది కొంతమంది ఆకతాయిలు చేసిన పని అయి ఉండవొచ్చని అనుమానిస్తున్నారు. సిగరెట్ కాల్చి దుకాణాలపై వేయడం వల్ల నిప్పు అంటుకొని మంటలు చెలరేగి ఉండవొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలించి.. మత్స్యకారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
జాలరిపేటలోని ఫిషింగ్ హార్బర్ లో ఉన్న ఈ బడ్డీలలో జాలర్లు తమ వలలు, బోటుకు సంబంధించిన వస్తులను భద్రపరుస్తుంటారు. ఒక్కో బడ్డీలో లక్ష నుంచి రెండు లక్షల విలువైన సామాగ్రి ఉంటుందని అవన్నీ మంటల్లో కాలి బూడిద అయ్యాయని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వల్ల ఫిషింగ్ హార్బర్ లో ఉన్న 40 బోట్లు తగలబడిపోయాయి.. సుమారు రూ.30 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోక ముందే మరోసారి అగ్ని ప్రమాదం సంభవించడంతో స్థానిక మత్స్యకారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకతాయిలు చేస్తున్న పని వల్ల తాము నష్టపోతున్నామని, నింధితులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ లో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.