Dharani
టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కామ్‌లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీ సీఐడీ ఫైబర్‌నెట్ కేసులో దూకుడు పెంచింది. ఆ వివరాలు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కామ్‌లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీ సీఐడీ ఫైబర్‌నెట్ కేసులో దూకుడు పెంచింది. ఆ వివరాలు..
Dharani
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కామ్‌లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో.. చంద్రబాబు మొన్నటి వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు. అక్టోబర్ 31న ఆయనకు ఏపీ హైకోర్టు ఈ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాస్త ఊరట లభించింది అనుకునేలోపే.. చంద్రబాబుకి భారీ షాక్ తగిలింది. ఆస్తులు అటాచ్ చేసేందుకు రెడీ అవుతోంది సీఐడీ. ఆ వివరాలు..
ఇక తాజాగా ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుతో పాటు పలువురిని నిందితులుగా చేర్చి.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. ఇప్పుడు వారిలో కొందరి ఆస్తుల జప్తుకు రెడీ అవుతోంది. ఇందుకు ప్రభుత్వం నుంచి హోంశాఖ అనుమతి కూడా మంజూరు చేసింది. దీంతో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఏపీ సీఐడీ సిద్ధమవుతోంది.
ఏపీ ఫైబర్ నెట్ పరికరాల కొనుగోళ్ల కేసులో అక్రమాలపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సీఐడీ.. ఇందులో చంద్రబాబుకు సన్నిహితుడైన టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత వేమూరి హరికృష్ణకు చెందిన ఆస్తుల్ని అటాచ్ చేయబోతోంది. ఇందులో టెరాసాఫ్ట్ కంపెనీకి చెందిన ఆస్తులతో పాటు మరో ఏడు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి అటాచ్ మెంట్‌కు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
టెరాసాఫ్ట్ కంపెనీ ఆస్తులతో పాటు.. కనుమూరి కోటేశ్వరరావుకు చెందిన 797 చదరపు అడుగుల ఇంటిస్ధలం, విశాఖలోని కిర్లంపూడి లే అవుట్‌లో ఉన్న కోటేశ్వరరావు కంపెనీకి చెందిన ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడలో ఉన్న నాలుగు ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలోని మొయినా బాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటి జప్తుకు సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారి ఆస్తుల అటాచ్‌మెంట్ పూర్తి చేశాక చంద్రబాబు విషయంలో ఏం చేయాలన్న దానిపై ఏపీ సీఐడీ నిర్ణయం తీసుకోనుంది. అయితే తాజాగా మధ్యంతర బెయిల్ తీసుకున్న చంద్రబాబును మరే ఇతర కేసుల్లోనూ చర్యలు తీసుకోబోమని హైకోర్టుకు హామీ ఇచ్చిన నేపథ్యంలో సీఐడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది అనేది ఆసక్తికరంగా మారింది.